పుస్తకం తీయగానే నిద్ర ముంచుకొస్తోందా?... కారణం వెల్లడించిన శాస్త్రవేత్తలు... ఈ ఒక్క పని చేస్తే నిద్ర రాదంటూ సలహా...

ABN , First Publish Date - 2023-03-20T10:38:31+05:30 IST

ఏదైనా పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే నిద్ర(sleep) ముంచుకువచ్చేస్తుంటుంది. దీనికి కారణమేమిటో, శాస్త్రవేత్తలు(Scientists) ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి చదువుతున్నప్పుడు, మన కళ్లపై ఎక్కువ ఒత్తిడి(stress) పడుతుంది. మన మెదడు కంప్యూటర్ మెమరీ మాదిరిగా చదివిన వాటిని ఫీడ్ చేస్తూనే ఉంటుంది.

పుస్తకం తీయగానే నిద్ర ముంచుకొస్తోందా?... కారణం వెల్లడించిన శాస్త్రవేత్తలు... ఈ ఒక్క పని చేస్తే నిద్ర రాదంటూ సలహా...

ఏదైనా పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే నిద్ర(sleep) ముంచుకువచ్చేస్తుంటుంది. దీనికి కారణమేమిటో, శాస్త్రవేత్తలు(Scientists) ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి చదువుతున్నప్పుడు, మన కళ్లపై ఎక్కువ ఒత్తిడి(stress) పడుతుంది. మన మెదడు కంప్యూటర్ మెమరీ మాదిరిగా చదివిన వాటిని ఫీడ్ చేస్తూనే ఉంటుంది.

అటువంటి పరిస్థితిలో కళ్ల కండరాలు(Eye muscles) విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో మెదడు(brain) కష్టపడి పనిచేయడానికి నిరాకరిస్తుంది. దీంతో నిద్రకు ఉపక్రమిస్తుంది. చదువుకునేటప్పుడు నిద్రపోవడానికి మరొక కారణం ఏమిటంటే... మన శరీరం(body) చాలావరకు చదువుకునేటప్పుడు రిలాక్స్‌డ్‌గా మారుతుంది. కళ్ళు, మెదడు మాత్రమే పని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో శరీర సడలింపు కారణంగా కండరాలు విశ్రాంతి(rest) తీసుకుంటాయి.

ఫలితంగా నిద్ర మొదలవుతుంది. చదువుకునేటప్పుడు(studying) నిద్ర రాకూడదంటే ఒకే భంగిమలో కూర్చుని చదవాలని నిపుణులు సిఫారసు చేస్తుంటారు. మన శరీరం విశ్రాంతి కోరినప్పుడు అది నిద్ర స్థితిలోకి వెళుతుంది. ఇది చదువుతున్నప్పుడే కాదు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు(travelling) కూడా జరుగుతుంది. ప్రయాణంలో నిద్రిస్తున్న వారిని చూసే ఉంటాం. దీని వెనుక కూడా ఇదే కారణం దాగివుంది. చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే చదువుకునే ప్రదేశంలో మంచి వెలుతురు(light) ఉండేలా చూసుకోవాలి.

మంచం మీద కూర్చొని ఎప్పుడూ చదవకండి. దానికి బదులుగా కుర్చీ-టేబుల్ మీద చదవడం ప్రాక్టీస్(Practice) చేయండి. దీంతో కుర్చీ, బల్ల చూడగానే చదువుకు మనసు సిద్ధమై బద్ధకాన్ని వదిలివేస్తుంది. మీ చదువును ప్రారంభించే ముందు తేలికపాటి భోజనం(meal) చేయండి, తద్వారా మీకు నీరసంగా అనిపించదు.

Updated Date - 2023-03-20T10:49:01+05:30 IST