Anushka Shetty: అనుష్క శెట్టి ఎందుకు ట్రెండింగ్ లో వుంది అంటే...

ABN , First Publish Date - 2023-03-01T11:42:33+05:30 IST

చాలా కాలం తరువాత అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన అనుష్క శెట్టి (#AnushkaShetty) సాంఘీక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో వుంది.

Anushka Shetty: అనుష్క శెట్టి ఎందుకు ట్రెండింగ్ లో వుంది అంటే...

చాలా కాలం తరువాత అగ్ర నటీమణుల్లో ఒకరు అయిన అనుష్క శెట్టి (#AnushkaShetty) సాంఘీక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో వుంది. ఇంతకీ విషయం ఏంటి అంటే, ఆమె నటించిన రాబోయే సినిమా టైటిల్ ప్రకటన ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ (#UVCreations) ఈ సినిమాని నిర్మిస్తుండగా, నవీన్ పోలిశెట్టి (#NaveenPolisetty) ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ (#AnushkaTurnedChef) గా నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా గత సంవత్సరం నవంబర్ 7 వ తేదీన ఒక పోస్టర్ విడుదల చేసారు. అందులో ఆమెను చెఫ్ గా చూపించారు.

anushkashetty.jpg

ఇదిలా ఉండగా ఈరోజు ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ అనుష్క శెట్టి మీడియా ముందుకు వస్తుందా, రాదా అన్న విషయం మాత్రం ఇంకా తెలీదు. ఎందుకంటే అనుష్క చాల సంవత్సరాల నుండి మీడియా ని ఎవాయిడ్ చేస్తూ వచ్చింది. 'సైజు జీరో' (#SizeZero) అనే సినిమాకి ఆమె పాత్ర కోసం కొన్ని కిలోలు బరువు ఎక్కింది. ఆ సినిమా అయ్యాక, ఆమె బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూనే వుంది కానీ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. అందుకని ఆమె మీడియా ముందుకు రావటం మానేసింది. 'బాహుబలి' (#Baahubali) సినిమా తరువాత ఆమె కొన్ని సినిమాలు చేసినా, మీడియా తో మాత్రం ఎక్కువ మాట్లాడలేదు.

anushkashetty2.jpg

అయితే మరి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఈరోజు నాలుగు గంటలకు ప్రకటించే అవకాశం వుంది కాబట్టి, ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా, లేక టైటిల్ సాంఘీక మాధ్యమాల్లో ప్రకటించేస్తారో చూడాలి. ఏమైనా కూడా, 41 సంవత్సరాల వయస్సున్న అనుష్క శెట్టి క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఆమె చాల గ్యాప్ తీసుకొని సినిమా చేస్తున్నా, ఆమెకి మొదట్లో ఎంత క్రేజ్ ఉందొ ఇప్పుడు కూడా అలానే వుంది. ఈ సినిమా విడుదల తేదీ, కూడా ప్రకటిస్తారేమో చూడాలి.

Updated Date - 2023-03-01T11:42:33+05:30 IST