2 రూపాయలు, 10 రూపాయల నాణేలపై నాలుగు గీతలు ఎందుకు ఉంటాయి? తరువాత వీటి ముద్రణ ఎందుకు నిలిపివేశారంటే..

ABN , First Publish Date - 2023-02-27T09:56:11+05:30 IST

ఎప్పటి నుంచో నాణేల చలామణీ అమలులో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ కరెన్సీ నాణేలలో అనేక మార్పులు వచ్చాయి.

2 రూపాయలు, 10 రూపాయల నాణేలపై నాలుగు గీతలు ఎందుకు ఉంటాయి? తరువాత వీటి ముద్రణ ఎందుకు నిలిపివేశారంటే..

ఎప్పటి నుంచో నాణేల చలామణీ అమలులో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ కరెన్సీ నాణేలలో అనేక మార్పులు వచ్చాయి. దేశంలో వివిధ డినామినేషన్ల నాణేలు విడుదల అయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా నాణేల రూపకల్పనలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ డిజైన్లలో రెండు,10 రూపాయల నాణేలపై చేసిన డిజైన్ గతంలో ఎంతో చర్చనీయాంశమైంది. ఎపిక్ ఛానల్‌లోని ఒక డాక్యుమెంటరీ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2006 సంవత్సరంలో రెండు రూపాయల కొత్త నాణేన్ని తయారు చేసింది.

ఈ నాణెం ప్రత్యేకత ఏమిటంటే, వెనుక వైపున ఒకదానికొకటి క్రాస్ చేస్తూ కొన్ని గీతలు కనిపిస్తాయి. దీంతో పాటు అందులో నాలుగు పాయింట్లు కూడా కనిపిస్తాయి. ఇదేకోవలో 10 రూపాయల నాణెం కూడా ఉంది. దానిపైనా అదే డిజైన్ కనిపిస్తుంది. ఈ నాలుగు గీతలు నలుగురు వేర్వేరు వ్యక్తుల ఐక్యతను సూచిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఈ నాణాలను తరువాత నిషేధించారు. దీనికి కారణం వాటిపై రూపొందించిన డిజైన్. దీనివెనుక పలు వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ నాణేలను ఆర్బీఐ నిలిపివేయవలసి వచ్చింది. ఈ నాణెంపై క్రైస్తవ మతానికి సంబంధించిన శిలువ తరహాలో డిజైన్ చేయడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ నాణేలు పెద్దగా చెలామణిలోకి రాకపోవడంతో వాటి తయారీని నిలిపివేశారు. 10 రూపాయణ నాణెం విషయంలోనూ ఇదే జరిగింది.

Updated Date - 2023-02-27T09:56:13+05:30 IST