Front Load vs Top Load: ఈ రెండు రకాల వాషింగ్ మెషీన్లలో ఏది బెస్ట్..? దేన్ని వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుందంటే..!

ABN , First Publish Date - 2023-09-05T16:26:10+05:30 IST

వాషింగ్ మెషీన్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒక దాంట్లో పైనున్న మూత తీసి దుస్తులు వేయాలి. రెండో దానిలో ముందున్న మూత తీసి దుస్తులు వేయాలి. వీటిని టాప్ లోడింగ్, ఫ్రంట్ లోడింగ్ మెషీన్లు అని అంటారు. వీటితో ఉపయోగాలు, వీటి వాడకంలో ఉండే సమస్యలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Front Load vs Top Load: ఈ రెండు రకాల వాషింగ్ మెషీన్లలో ఏది బెస్ట్..? దేన్ని వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో వాషింగ్ మెషీన్ లేకుండా పూట గడవడం కష్టం. బయట ఆఫీసుల్లో ఎనిమిది లేదా పది గంటలు పని చేసి ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని ఇంటికి వచ్చాక మళ్లీ బట్టలు ఉతకాలంటే సాధ్యమయ్యే పనికాదు. అందుకే వాషింగ్ మెషీన్(Washing Machine) వినియోగం విపరీతంగా పెరిగిపోయింద. అనేక మంది వాషింగ్ మెషీన్ కొనేందుుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త వటిని కొనే వారి మదలిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న.. ఫ్రంట్ లోడ్ కొనాలా లేదా టాప్ లోడ్ మెషీన్ కొనాలా?!

ఏమిటీ వీటి మధ్య తేడా..?

టాప్ లోడ్ మెషీన్(Top load Washing Machine).. పేరుకు తగ్గట్టుగానే దీంట్లో బట్టలు వేసేందుకు యంత్రంపైన ఉన్న మూత తెరవాలి. అదే ఫ్రంట్ లోడింగ్ మెషీన్‌లో మాత్రం యంత్రం ముందువైపు తలుపు ఉంటుంది. ఇక వేటి ఉపయోగాలు వాటికి ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతారు.

టెక్నీషియన్లు, అనుభవజ్ఞుల ప్రకారం టాప్ లోడింగ్ మెషిన్లు వినియోగానికి ఎంతో అనువుగా ఉంటాయి. వాషింగ్ మెషీన్‌పై ఉన్న మూత తెరిచి సులువుగా దుస్తులు లోపలికి వేయచ్చు. దీంతో, ముందుకు వంగే బాధ తప్పిపోతుంది. నడుము నొప్పి ఉన్న వారు, ముసలి వారికి ఇది ఎంతో అనువు. అయితే, ఈ వాషింగ్ మెషీన్లలో దుస్తులపై కాస్తంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టెక్నీషియన్లు చెబుతారు. పరిమితికి మించి అందులో దుస్తులు వేస్తే పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది.

అంతేకాకుండా, దిళ్లు, లేదా పెద్ద పెద్ద కంఫర్టర్లు మెషీన్ లోపల పూర్తిగా మునగవు కాబట్టి ఇబ్బంది ఎదురవుతుందని చెబుతారు. అయితే, టాప్‌ లోడ్ మెషీన్‌ రన్నింగ్‌లో ఉన్నప్పుడే మరికొన్ని జతల బట్టలు వేసే అవకాశం ఉంది. ఫ్రంట్ లోడింగ్ మెషీన్‌లో ఈ అవకాశం లేదు. ఒకసారి వేసి బట్టలు ఉతకడం పూర్తయ్యాకే రెండో రౌండ్ దుస్తులు ఉతకడం ప్రారంభించాలి.


ఇక, ఫ్రంట్ లోడ్ ఆటోమేటిక్ మెషీన్‌లో(Front load Washing Machine) దస్తులపై ప్రభావం తక్కువగా ఉంటుందని టెక్నీషియన్లు చెబుతుంటారు. అంతేకాకుండా, వీటితో నీరు, విద్యుత్ వినియోగం కూడా తక్కువే! అంటే, మంచి సామర్థ్యంతో పని చేసే ఫ్రంట్ లోడర్ వాషింగ్ మెషీన్‌తో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయన్నమాట.

ఇక ఫ్రంట్ లోడింగ్ యంత్రాల్లోనే స్పిన్నింగ్ సైకిల్ వేగం ఎక్కువ. టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ల కంటే ఇవి మూడో వంతు ఎక్కువ వేగంతో తిరుగుతాయి. ఫలితంగా దుస్తులు ఆరబెట్టడం మరింత సులువవుతుంది.

ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఫ్రంట్ లోడింగ్ యంత్రాల విషయంలో ఎక్కువగా వినిపించే కంప్లైంట్ మురికి! యంత్రం తలుపు చుట్టూరా ఉంటే రబ్బర్ గ్యాస్కెట్‌పై (Rubber Gasket) మురికి పేరుకుపోతోందని అత్యధిక శాతం కస్టమర్లు ఫిర్యాదు చేస్తుంటారని టెక్నీషియన్లు చెబుతారు. దీంతో పాటు ఫ్రంట్ లోడర్ల నిర్వహణ ఖర్చులు కూడా టాప్ లోడర్లతో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి.. కస్టమర్లు తమ అవసరాలను బట్టి వాషింగ్ మెషీన్లు ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-09-05T16:39:53+05:30 IST