Viral: అబ్బబ్బా.. ఫ్యాన్ అంటే నువ్వే అన్నా.. వెంటిలేటర్‌పై ఉన్నా స్టార్ హీరో మూవీ కోసం సినిమా హాల్‌కు..

ABN , First Publish Date - 2023-09-17T22:07:55+05:30 IST

తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ సినిమా చూసేందుకు వెంటిలేటర్‌తో సహా వచ్చాడో దివ్యాంగుడు. అతడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral: అబ్బబ్బా.. ఫ్యాన్ అంటే నువ్వే అన్నా.. వెంటిలేటర్‌పై ఉన్నా స్టార్ హీరో మూవీ కోసం సినిమా హాల్‌కు..

ఇంటర్నెట్ డెస్క్: సినీతారలకు ఫ్యాన్స్ ఉండటం సాధారణమే. కానీ భారతీయ సినీఅభిమానుల రేంజే వేరు. ఎల్లలు, కోటలు దాటిపోయే అభిమానం వారిది. తమ అభిమాన, నటినటుల కోసం గుళ్లు కట్టించేవారు, పాలాభిషేకాలు చేసేవారు కోకొల్లలు. తమ అభిమానం చాటుకునేందుకు ఏం చేసేందుకైనా వెనకాడరు. మరి దేశంలో అందరికంటే పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పటివరకూ సమాధానం లేదు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మన అభిప్రాయాలు మార్చుకోవాల్సిందే.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కోట్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షారూఖ్ అభిమానులను ఈ సినిమా ఉర్రూతలూగిస్తోంది. ఇక అనీజ్ ఫారూఖీకి షారూఖ్ అంటే ఎంత అభిమానమో మాటల్లో చెప్పడం కష్టం. అసలు అతడి అభిమానాన్ని కొలిచేందుకు భాషే చాలదు. అనీజ్‌కు శారీరక వైకల్యం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అతడు వెంటిలేటర్‌పై ఉన్నాడు.

కానీ షారుఖ్ సినిమా విడుదలైందని తెలియగానే అతడిలో ఓ నూతనోత్సాహం పొంగుకొచ్చింది. ఎంతలా అంటే.. వంట్లో ఉన్న నీరసం, నిస్సత్తువ, వైకల్యం కూడా గుర్తురానంతగా ఊపు వచ్చేసింది. దీంతో, మనోడు వెంటిలేటర్ శరీరానికి అమర్చి ఉన్నా సరే షారుఖ్ మూవీకి వెళ్లేందుకు సిద్ధమైయ్యాడు. మరికొందరు సాయంతో వెంటిలేటర్ తీసుకుని మరీ సినిమా హాల్‌కు వచ్చాడు. షారుఖ్ చెబుతున్న ఒక్కో డైలాగు, అతడి నటనను మనసారా ఆస్వాదిస్తూ సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేశాడు(Shahrukh fan watches jawan in theatre while on ventilator).

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలైన ఫ్యాన్ అంటే నువ్వే బ్రో.. అనారోగ్యం బాధిస్తున్నా, వెంటిలేటర్‌పై ఉన్నా లెక్కచేయకుండా దానితో సహా థియేటర్‌కు సినిమా కోసం వచ్చిన నువ్వు నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను మీరూ చూస్తే దేశంలో ఇతడి కంటే గొప్ప ఫ్యాన్ మరొకరు ఉండరని అంగీకరిస్తారు!

Updated Date - 2023-09-17T22:19:08+05:30 IST