Viral Video: ఈ కాలం కుర్రాళ్లు కూడా ఈ బామ్మ ముందు బలాదూర్.. మోపెడ్ బండిపై ఒంటరిగా 600 కిలోమీటర్ల జర్నీ..!
ABN , First Publish Date - 2023-09-21T18:51:31+05:30 IST
66 ఏళ్ల ముదిమి వయసులో ఓ మహిళ మోపెడ్ నడుపుకుంటూ ఒంటరిగా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వరకూ వెళ్లింది. వృద్ధాప్యంపై విజయం సాధించినట్టు కనబడుతున్న ఈ మహిళలకు స్థానికులు పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నె్ట్ డెస్క్: వృద్ధాప్యం ప్రకృతి సహజం. పుట్టిన ప్రతి జీవీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం చివరకు మరణాన్ని ఎదుర్కోక తప్పదు. అయితే, కొందరు మాత్రం తమపై వయసు ప్రభావమే లేనట్టు కనిపిస్తుంటారు. మధ్యప్రదేశ్‌కు(Madhya pradesh) చెందిన ఈ బామ్మ సరిగ్గా ఇలాంటి వ్యక్తే. కుర్రాళ్లు కూడా ఈమె ముందు బలాదూర్. 30-35 ఏళ్ల వయసుకే కొందరు బైక్‌పై గంటపాటు ప్రయాణిస్తేనే అలసిపోయామంటూ కూలబడిపోతుంటారు. కానీ, ఈ బామ్మ 66 ఏళ్ల వయసులోనూ 600 కిలోమీటర్ల దూరం మోపెడ్‌పై వెళ్లింది..అదీ కూడా ఒంటరిగా! అందుకే జనాలు ఈ బామ్మ వీడియో చూసి షాకయిపోతున్నారు. ఆమె టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ బామ్మ పేరు సోహాన్‌బాయి. తాను ఉండేది నీమచ్ జిల్లాలోని మాన్సా తెహ్సిల్‌లో! చాలా ఏళ్లక్రితమే ఆమె భర్తతో విడిపోయింది. ఆ తరువాత పిల్లలతో పాటూ పుట్టింటికి వచ్చేసింది. నాటి నుంచి ఆమె పాలు అమ్ముతూ సొంతసంపాదనతో బిడ్డల్ని పెంచిపెద్ద చేసింది. మోపెడ్‌పై పాలు అమ్మడం ప్రారంభించిన ఆమెకు క్రమక్రమంగా డ్రైవింగ్ కొట్టినపిండి అయిపోయింది. ఎంతలా అంటే ఆమె ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం మోపెడ్ నడుపుకుంటూ ఒంటరిగా ప్రయాణించగలదు. ఇటీవలే ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్(Rajasthan) వరకూ ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది(Old woman from MP travels 600 km on moped). దీంతో, ఈ బామ్మను చూసి స్థానికులే ఆశ్చర్యపోయారు. ఆమె ఉత్సాహానికి అనేక మంది పాదాభివందనం చేయడం కూడా వీడియోలో చూడొచ్చు.
ఆమె జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట బాట పట్టి నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ వయసులో ఇంత దూరం మోపెడ్‌పై అదీ ఒంటరిగా ప్రయాణించడం మామూలు విషయం కాదంటూ అనేక మంది ఈ వృద్ధురాలిపై ప్రశంసలు కురిపించారు. వృద్ధాప్యం శరీరానికే గానీ మనసుకు కాదని ఆమె నిరూపించిందని మరొకరు కామంట్ చేశారు. మనసు ఉత్సాహంతో ఉరకలెత్తితే శరీరం అదే మనమాట వింటుందని మరికొందరు కామెంట్ చేశారు. మరి నెట్టింట ఇంతలా వైరల్(Viral Video) అవుతున్న వీడియోనూ మీరూ ఓమారు లుక్కేయండి!