Python Video: కరెంటు వైర్లలో ఇరుక్కుపోయిన కొండ చిలువలు.. ఎటూ వెళ్లలేక ఇబ్బందులు.. చివరకు ఎలా బయటకు తీశారంటే..!
ABN , First Publish Date - 2023-09-30T17:15:55+05:30 IST
విద్యుత్ తీగల మధ్య చిక్కుకుపోయిన ఓ పామును కాపాడిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పాము పేరెత్తితేనే చాలు ఉలిక్కిపడేవాళ్లు బోలెడంత మంది ఉంటారు. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను కనిపిస్తే వెనక్కు తిరిగి చూడకుండా అనేక మంది జంపైపోతారు. కానీ, జంతు సంరక్షకుల విషయం మాత్రం పూర్తిగా భిన్నం. మూగ జీవాలను రక్షించేందుకు వారు రిస్కు తీసుకునేందుకు కూడా వెనకాడరు. ముఖ్యంగా పాములను రక్షించే వారి ధైర్యసాహసాలు చూస్తే మాత్రం ఒళ్లు జలదరించాల్సిందే. ప్రస్తుతం రెండు కొండ చిలువలను రక్షించిన ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కరెంట్ వైర్ల మధ్య ఇరుక్కుపోయి ప్రమాదంలో పడ్డ వాటిని కొందరు కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(viral Video) మారింది.
యూపీలోని(Uttarpradesh) జువావ్‌పూర్ జిల్లాలో సెప్టెంబర్ 26 న ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ఇంట్లోకి చొచ్చుకెళ్లిన రెండు భారీ కొండ చిలువలు అక్కడ స్విచ్ బోర్డులు, కరెంట్ తీగలు ఉన్న చోటు వెళ్లి దాక్కున్నాయి. కాసేపు అక్కడే అటూఇటూ తిరిగి చివరకు కరెంట్ తీగల మధ్య ఇరుక్కుపోయాయి. భవనంలోని వారు ఇదంతా చూశారు. పాములను అలాగే వదిలేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే పాముల సంరక్షకులకు సమాచారం అందించారు.
అటుపై రంగంలోకి దిగిన వారు కొండచిలువలను చాలా ఒడుపుగా కరెంట్ వైర్ల నుంచి తప్పించి బయటకు లాగారు(Python caught between electrical wires rescued). కెరంట్ వైర్లను పక్కకు తప్పించి వాటిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. కొన్ని సార్లు అవి వారిని కాటేసేందుకు ప్రయత్నించినా వారు భయపడలేదు. పాములను జాగ్రత్తగా బయటకు తీసి ఓ సంచిలో వేసి కట్టేశారు. ఆ తరువాత సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జంతు సంరక్షకుల ధైర్యసాహసాలకు, సేవతత్పరతకు ముగ్ధులవుతున్నారు.