Balagam: ‘బలగం’ కాపీ కథా!.. రిలీజ్ రోజే ఈ కాంట్రవర్సీ ఏంటి?

ABN , First Publish Date - 2023-03-03T22:17:24+05:30 IST

రెండు మూడు రోజులుగా చిన్న సినిమా ‘బలగం’ (Balagam)కు సంబంధించి టాక్ బాగా వైరల్ అవుతుంది. ప్రమోషన్స్, ప్రీమియర్స్ అంటూ విడుదలకు ముందు ఈ సినిమాకి రావాల్సిన క్రేజ్ వచ్చింది. ప్రీమియర్స్ తర్వాత

Balagam: ‘బలగం’ కాపీ కథా!.. రిలీజ్ రోజే ఈ కాంట్రవర్సీ ఏంటి?
Satish Gaddam and Priyadarshi

రెండు మూడు రోజులుగా చిన్న సినిమా ‘బలగం’ (Balagam)కు సంబంధించి టాక్ బాగా వైరల్ అవుతుంది. ప్రమోషన్స్, ప్రీమియర్స్ అంటూ విడుదలకు ముందు ఈ సినిమాకి రావాల్సిన క్రేజ్ వచ్చింది. ప్రీమియర్స్ తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. అద్భుతమైన సినిమా అంటూ కితాబిచ్చారు. మార్చి 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది. అయితే విడుదలైన రోజే.. ఈ సినిమాపై కాంట్రవర్సీ నెలకొంది. ఈ సినిమా కథ తనదంటూ జర్నలిస్ట్ కమ్ రైటర్ సతీష్ గడ్డం (Satish Gaddam) మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ సినిమా మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కథపై నెలకొన్న కాంట్రవర్సీ నేపథ్యంలో సతీష్ గడ్డం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా తెరకెక్కిందని తెలిసి.. ఒక తెలంగాణ అభిమానిగా ఈ సినిమా చూడటానికి ప్రీమియర్ షోకి వెళ్ళాను. సినిమా చూస్తుంటే అప్పుడర్థమైంది.. ఇది నేను రాసిన కథే కదా అని ఆశ్చర్యపోయాను. నేను రాసిన కథకు, ‘బలగం’ సినిమా కథకు చాలా సారూప్యతలు ఉన్నాయి’’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. 2014లో ఓ న్యూస్ పేపర్ సండే బుక్‌లో ‘పచ్చికి’ (Pachhiki) అని తను రాసిన కథని స్వల్ప మార్పులు చేసి ‘బలగం’గా తెరకెక్కించినట్లుగా ఆయన ఆరోపణలు చేశారు. ఇందులో ‘పిట్టకు వెట్టుడు’ సంప్రదాయాన్ని, అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసాన్ని మేళవించినట్లుగా సతీష్ గడ్డం తెలిపారు. మూలకథ అని చెప్పి.. చిత్ర టైటిల్స్‌లో తన పేరు కూడా జోడించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే సతీష్ గడ్డం ఆరోపణలపై చిత్ర దర్శకనిర్మాతలెవరూ ఇంత వరకు స్పందించలేదు. (Balagam In Story Controversy)

ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) జంటగా నటించిన ఈ చిత్రంతో కమెడియన్ వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకుడిగా పరిచయమయ్యారు. వేణు యెల్దండి.. ‘జబర్దస్త్ వేణు’గా అందరికీ పరిచయమే. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-03T22:35:32+05:30 IST