Venkatesh: రానాతో అంత అది ఈజీ రాదు!

ABN , First Publish Date - 2023-03-02T18:46:25+05:30 IST

వెంకటేశ్‌ తొలిసారి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఇందులో వెంకీతోపాటు రానా దగ్గుబాటి కూడా నటించారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ దర్శకత్వం వహించారు.

Venkatesh: రానాతో అంత అది ఈజీ రాదు!

వెంకటేశ్‌ (Venkatesh)తొలిసారి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’*Rana naidu). ఇందులో వెంకీతోపాటు రానా దగ్గుబాటి *rana daggubati)కూడా నటించారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న (rana naidu on 10 march)నెట్‌ఫ్లిక్స్‌లో స్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘రానా నాయుడు’ సిరీస్‌ ఎగ్జైటింగ్‌ జర్నీ. వెబ్‌ సిరీస్‌కు పనిచేయడానికి, సినిమా చేయడానికి చాలా తేడా ఉంటుంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. నెగటివ్‌ షేడున్న పాత్ర చేయడంకొత్త అనుభూతి కలిగించింది. ఇలాంటి పాత్రలంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్‌గా చేసే పాత్రలతో కంపేర్‌ చేస్తే ఇది పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర. సవాల్‌ విసరడమే కాకుండా తృప్తినిచ్చింది. రానాకి ఎదురు పోరాటం చేయడం అంత సులువు కాదు. నాకిది ఒక సవాల్‌. ఆఫ్‌-స్ర్కీన్‌ మాకు గొప్ప ఈక్వేషన్‌ వుంది. బాబాయ్‌.. అబ్బాయి కంటే మేము స్నేహితుల ఉంటాం. కానీ తెరపై, ఒకరంటే ఒకరికి పడని తండ్రి-కొడుకులుగా వార్‌ ఈక్వేషన్‌ తీసుకురావడం కష్టం. ఒక నటుడికి ఇలాంటి సిచ్చువేషన్‌ రావడం కష్టం. కానీ ఈ పాత్రలకు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. మా ఇద్దరికి ఈ పాత్రలు కొత్త అనుభూతి కలిగించాయి’’ అని అన్నారు.

2.jpg

Updated Date - 2023-03-02T18:57:25+05:30 IST