Vani Jayaram: వాణీ జయరాం పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తి.. ఏం తేలుతుందో అని టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2023-02-04T19:43:35+05:30 IST

ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం (Vani Jayaram Suspected Death) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు...

Vani Jayaram: వాణీ జయరాం పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తి.. ఏం తేలుతుందో అని టెన్షన్.. టెన్షన్

చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం (Vani Jayaram Suspected Death) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శనివారం నాడు ఆమె చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై (Chennai) నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వంటమనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు (Police) తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే చనిపోయి ఉన్నారు వాణి. దీంతో ఆమె పార్థివ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే డాక్టర్లు పోస్టుమార్టం (Post Mortem) పూర్తి చేశారు. అనంతరం చెన్నైలోని ఫ్లాట్‌కు వాణీ జయరామ్ పార్థివదేహాన్ని తరలించారు. ఆమెను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నగర అధికారులు.

Vani-Death.jpg

రిపోర్టు కోసం..

వాణీ జయరామ్‌ మృతిపై అభిమానులు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలున్నాయి. దీంతో ఈ ఘటన ఓ మిస్టరీగా మారింది. ఆమె నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమెకు బలంగా గాయాలయ్యాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు బయటికొస్తే.. వాణీ జయరామ్ ఎలా చనిపోయారు..? కారణాలేంటి..? అనే విషయాలు తేలిపోనున్నాయి. రిపోర్టు కోసం అటు అభిమానులు.. ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు వేచి చూస్తున్నారు. మరోవైపు.. వాణీ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు.

ఏం జరిగిందో..!

రోజూలానే వాణీ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ శనివారం కూడా వాణీ జయరాం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు (Vani Jayaram House) వెళ్లింది. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దీంతో.. కంగారుపడిన పనిమనిషి వాణీ జయరాం బంధువులకు (Vani Jayaram Chennai House) సమాచారం అందించింది. ఆ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బంధువులు తలుపులు బద్ధలకొట్టి వెళ్లి చూడగా విగజీవిగా పడివున్నారు. దీంతో అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.

Updated Date - 2023-02-04T20:43:40+05:30 IST