Shocking Video: ఒకే కారులో 25 మంది చిన్న పిల్లలు.. చూసి అవాక్కైన పోలీసులు.. డిక్కీలో కూడా కుక్కేశారు..!
ABN , First Publish Date - 2023-09-21T18:27:23+05:30 IST
ఓ ఉపాధ్యాయురాలు నలుగురు మాత్రమే పట్టే చిన్న కారులో ఏకంగా 25 మంది చిన్నారులను తరలించిన వైనం నెట్టింట్ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతూ మహిళను తిట్టిపోస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బాల్యం అంటేనే అమాయకత్వానికి పర్యాయపదం. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు చిన్నారుల విషయంలో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుంటారు. మానవత్వానికి మచ్చతెచ్చే పనులు చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. స్వయంగా టీచర్ అయి ఉండి కూడా ఓ మహిళ చిన్నారులతో వ్యవహరరించిన తీరు నెటిజన్లను విస్మయపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral video) మారింది. ఉజ్బెకిస్థాన్‌లో(Uzbekistan) ఇటీవల వెలుగు చూసీందీ ఘటన.
పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ మహిళా టీచర్ ఏకంగా 25 మంది చిన్నారులు నలుగురు ప్రయాణికులు మాత్రమే పట్టే చిన్నాకారులో కుక్కి తరలించేందుకు ప్రయత్నించింది. కొందరిని డిక్కీలో, మరికొందరు సీట్లో ఇష్టారీతిన కుక్కి తరలించింది. ట్రాఫిక్ పోలీసులు ఆ మార్గంలో తనిఖీలు చేస్తుండగా మహిళ బాగోతం బయటపడింది. అంత చిన్న కారులో ఏకంగా 25 మంది చిన్నారులను మహిళ తరలిస్తుండటం చూసి ఏకంగా పోలీసులే ఆశ్చర్యపోయారు. మహిళ చేసిన పనికి ఒక్క క్షణం నిర్ఘాంత పోయారు(woman transports 25 kids in single car).
అంత ఇరుగ్గా కూర్చోవడంతో చిన్నారుల్లో అనేక మంది తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కొందరు ఆ చికాకును తట్టుకోలేక కారు డోర్లు తెరవగానే పోలీసులను చూసి ఏడ్చేశారు. కాగా, మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా నడుచుకున్నందుకు ఆ మహిళా టీచర్‌పై నెట్టింట ప్రస్తుతం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.