Viral: రెండేళ్ల పాటు ఒంటరిగా.. ఇప్పుడు మొగుడు కావాలంటూ వీధుల్లో వెతుకులాట.. ఈమె కథ వింటే..

ABN , First Publish Date - 2023-09-12T19:16:00+05:30 IST

రెండేళ్ల పాటు ఓ తోడు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి నిరాశ చెందిన ఓ అమెరికా యువతి ఇప్పుడు భర్త కావాలంటూ వీధుల్లో ప్లకార్డును ప్రదర్శిస్తోంది. డేటింగ్ యాప్స్‌లో కనిపించేవాళ్లు టైం పాస్ కోసం చూస్తున్నారు తప్ప లైఫ్‌లో సెటిలవ్వాలన్న ఆలోచన ఉండట్లేదని వాపోయింది.

Viral:  రెండేళ్ల పాటు ఒంటరిగా.. ఇప్పుడు మొగుడు కావాలంటూ వీధుల్లో వెతుకులాట.. ఈమె కథ వింటే..

ఇంటర్నెట్ డెస్క్: కష్టసుఖాల్లో తోడు జీవితాంతం వెన్నంటి ఉంటూ అండగా నిలిచే తోడు కోరుకోని వారంటూ ఉండరు. అయితే, మొగుడు కావాలంటూ వీధుల్లో ప్లకార్డు ప్రదర్శిస్తూ తిరుగుతున్న ఓ మహిళ కరోలినా గీట్స్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా(Viral News) మారింది. 29 ఏళ్ల కరోలీనా గేట్స్‌కు తన కెరీర్‌లో దూసుకుపోతున్నా తోడు కోసం ఆమె పడుతున్న తాపత్రయం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

మన్‌హట్టన్ నగరానికి చెందిన కెరోలీనా గీట్స్(Karolina geits) ఫ్యాషన్ మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె వీడియోలకు ఇప్పటివరకూ మొత్తం 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ రెండేళ్లుగా ఆమె ఒంటరి తనంతో బాధపడుతోంది. తనను అర్థం చేసుకునే తోడు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అనుకున్న ఫలితం దక్కలేదు. దీంతో, ఆమె తనకో భర్తను వెతుక్కునేందుకు వినూత్న పంథా ఎంచుకుంది. తనకు భర్త కావాలి అని రాసుకున్న ప్లకార్డును పట్టుకుని వీధుల్లో నిలబడి తన జీవతభాగస్వామిని వెతుక్కుంటోంది(US woman searching for husband on streets).


ప్లకార్డు ప్రదర్శిస్తూ భర్త కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయని కూడా ఆమె నమ్మకంగా చెప్పింది. ‘‘ప్రకృతిది ఓ ప్రత్యేక పంథా. నా మనసుకు నచ్చే వాడిని కచ్చితంగా నా చెంతకు చేరుస్తుందన్న నమ్మకం నాకుంది. ఇప్పటికే ఓ వ్యక్తి నన్ను కలిశాడు. మేం ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. తరచూ మాట్లాడుకుంటున్నాం. బహుశా అతడే నా జీవిత భాగస్వామి కావచ్చు’’ అని ఆమె ఇటీవల ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

ఇటీవల కాలంలో జనాలు డేటింగ్ యాప్‌లలో తోడు కోసం సీరియస్‌గా ప్రయత్నించట్లేదని ఆమె తెలిపింది. ఏదో టైం పాస్ కోసం ఈ వేదికలను ఆశ్రయిస్తున్నానని చెప్పింది. ఓ వ్యక్తిని ప్రేమించడంతో, వాళ్లతోనే జీవితాంతం కలిసుండటం అనే విషయాలను తాను బలంగా నమ్ముతానని, తన మనసుకు నచ్చిన వ్యక్తి కచ్చితంగా తన జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడని కెరోలీనా విశ్వాసం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-09-12T19:16:03+05:30 IST