Woman Techie: వెయ్యి రూపాయల కోసం ఆశపడితే.. ఏకంగా రూ.4.35 లక్షలు మటాష్.. ఓ మహిళా టెకీకి షాకింగ్ అనుభవం..!
ABN , First Publish Date - 2023-09-19T18:55:33+05:30 IST
రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం అంటే నమ్మి నిందితుల కోరిన డబ్బు ఇచ్చిన మహిళా టెకీ చివరకు రూ.4.35 లక్షలు కోల్పోయింది. యూపీలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: వెయ్యి రూపాయల కోసం ఆశపడిందో మహిళా టెకీ. ఆ తరువాత తెలీకుండానే చిక్కుల్లో పడిపోయింది. చివరకు సుమారు రూ.4.35 లక్షలు నష్టపోయింది. ఉత్తర్‌ప్రదేశ్(UP) ఘాజియాబాద్‌లో(Ghaziabad) వెలుగుచూసిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే, నిషిత అనే టెకీ ఆన్‌లైన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం వెతుకుతుండగా ఓ ఆఫర్ ఆమె కంట పడింది.
నిత్యం సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారు చేసే ట్వీట్లు, పోస్టులకు లైకులు పెడితే రోజుకు వెయ్యికిపైగా సంపాదించొచ్చనేది ఆ యాడ్ సారాంశం. దీంతో, యువతి యాడ్‌లో పేర్కొన్న నెంబర్‌కు ఫోన్ చేసింది. వారు మహిళా టెకీని నమ్మకం చూరగొని జాగ్రత్తగా ముగ్గులోకి దింపారు. తొలి రెండు రోజుల పాటు ఆమె అకౌంటుకు ఠంచనుగా డబ్బు పంపించారు. అంతా సవ్యంగా సాగిపోతోందని టెకీ కి నమ్మకం కుదురుతున్న తరుణంలో అసలు మోసానికి తెరలేపారు(Female techie fell in trap of cyber criminals).
క్రిప్టోల్లో పెడ్డుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆమెకు ఆశచూపించారు. అప్పటికే వారిపై నమ్మకం పెంచుకున్న ఆమె నిందితుల సూచన మేరకు రూ.14 వేలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. ఆ తరువాత రెండు సైబర్ నేరగాళ్లు మొత్తం 16,500 బదిలీ చేశారు. దీంతో, ఆమెకు వారిపై ఉన్న సందేహాలన్నీ పూర్తిగా మాయమైపోయాయి. ఆ తరువతా వారి కోరినట్టు విడతల వారీగా సుమారు రూ.4.35 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. కానీ, అటువైపు నుంచి రాబడి లేకపోగా నిందితులు రకరకాల చార్జీల పేరు చెప్పి మరింత డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు(Looses over 4.35 lakhs).
అప్పటికి మహిళా టెకీకి తాను మోసపోయాన్న(Cyber scam) విషయం గ్రహింపునకు రావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డబ్బు ఏయే అకౌంట్లలో జమ అయ్యందీ, చివరకు ఎవరకు బదిలీ అయ్యిందీ అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.