బడ్జెట్‌ అంటే ఏమిటి? అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందంటే...

ABN , First Publish Date - 2023-01-31T08:56:11+05:30 IST

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై దేశప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌ ఎందుకు సిద్ధం చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు బడ్జెట్‌కు సంబంధించిన పలు వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్‌ అంటే ఏమిటి? అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందంటే...

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై దేశప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌ ఎందుకు సిద్ధం చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు బడ్జెట్‌కు సంబంధించిన పలు వివరాలు తెలుసుకుందాం.

తద్వారా బడ్జెట్ అంటే ఏమిటో, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అర్థమవుతుంది. బడ్జెట్ అనేది ప్రభుత్వానికి మాత్రమే కాకుండా తన ఆర్థిక పరిస్థితిని సజావుగా నిర్వహించాలనుకునే ప్రతి వ్యక్తికి అవసరం. పొదుపు గురించి మాట్లాడేటప్పుడు భవిష్యత్తులో మనం దేనికి డబ్బు ఖర్చు చేస్తామో దాని ఆధారంగా పొదుపును నిర్ధారిస్తాం. ఇంటి బడ్జెట్ అయినా, ప్రభుత్వమైనా.. రెండింటి ఉద్దేశం ఒక్కటే. వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా నిర్వహించడం. బడ్జెట్ అనేది సంవత్సరం మొత్తానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయడం. డబ్బును వేటిపై ఖర్చు చేయాలో నిర్ణయించడం.

దేశంలోని ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతుంది. బడ్జెట్ అందించే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దాని ద్వారా మనం దేనికి ఎంత ఖర్చు చేయాలనేది తెలుస్తుంది. ఇది మనకు అవసరాలు, కోరికల మధ్య తేడాను తెలియజేస్తుంది. బడ్జెట్‌ను రూపొందించడం ద్వారా ఏ రంగంలోనైనా వృథా ఖర్చులను నివారించవచ్చు. దీనితో పాటు అనవసర రుణాలను నివారించవచ్చు. సరైన బడ్జెట్ ద్వారా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురుకావు. ఖర్చులు ఒక వ్యూహం ప్రకారం కొనసాగుతాయి.

Updated Date - 2023-01-31T08:56:13+05:30 IST