Share News

UK: మరణించి మళ్లీ బతికిన మహిళ.. పునర్జన్మపై ఆమె మాటలు విని షాక్ అయిన డాక్టర్లు

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:10 PM

యూకేలో ఓ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ 40 నిమిషాల తరువాత మళ్లీ బతికింది. ఇందుకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ కు చెందిన క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) ఇటీవల స్పృహ కోల్పోయింది.

UK: మరణించి మళ్లీ బతికిన మహిళ.. పునర్జన్మపై ఆమె మాటలు విని షాక్ అయిన డాక్టర్లు

లండన్: చనిపోయిన వారిని మళ్లీ బతికించవచ్చా.. పునర్జన్మ సాధ్యమవుతుందా.. ఇవి వైద్య రంగాన్ని దశాబ్దాలుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు. ఇప్పటికే ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వారి పరిశోధనలకు ఊతమిచ్చేలా యూకేలో ఓ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ 40 నిమిషాల తరువాత మళ్లీ బతికింది.

ఇందుకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ కు చెందిన క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) ఇటీవల స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహిళ మృతి చెందినట్లు తెలిపారు. పోస్టు మార్టానికి ఏర్పాట్లు చేస్తుండగా 40 నిమిషాల తరువాత ఆమె శరీరంలో కదలికల్ని గుర్తించారు. వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాధితురాలు చెప్పిన మాటలు విని డాక్టర్లు షాక్ తిన్నారు.


"పునర్జన్మ ఉంటుందా అనిపిస్తోంది. మళ్లీ బతుకుతాననే ఆశలేవీ లేని టైంలో జీవితం మరో ఛాన్స్ ఇచ్చింది. ఆ రోజు నేను మర్చిపోలేను. నా భర్త స్టూతో కలిసి డిన్నర్ కి వెళ్దామనుకున్నాం. మరి కాసేపట్లో బయలుదేరుతున్నాం అనేలోపు ఇంట్లో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలిచినా చలనం లేకుండా పడిపోయాను. నా ఆత్మ శరీరాన్ని వదిలి బయటకి పోయినట్లు అనిపించింది. నన్ను ఆసుపత్రికి తరలించి డాక్టర్లు పరీక్షించడం గుర్తుంది. నేను బతికే అవకాశాలు లేవని డాక్టర్లు స్టూ కి చెప్పడం గమనించాను.

చివరికి నేను మరణించినట్లు నిర్ధారించారు. 40 నిమిషాల తరువాత నాకు స్పృహ వచ్చింది. అప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి. ప్రస్తుతం నేను సాధారణ జీవితం గడుపుతున్నాను" అని క్రిస్టీ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సాధారణంగా 10 నిమిషాలపాటు మెదడుకు ఆక్సిజన్ అందకపోతేనే ప్రాణాలు పోతాయి. అలాంటిది 40 నిమిషాలపాటు క్రిస్టినా ఎలా ఉండగలిగింది అని డాక్టర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మెడికల్ మిరాకిల్ గా అభివర్ణిస్తూ.. మరింత లోతుగా రిసర్చ్ చేస్తున్నారు. పునర్జన్మపై ఆమె కేస్ స్టడీ వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 29 , 2023 | 01:14 PM