Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో సీటు కోసం పంతానికి పోయిన ఇద్దరు యువతులు.. చెప్పులతో కొట్టుకునేదాకా వెళ్లారుగా..!

ABN , First Publish Date - 2023-03-30T21:25:22+05:30 IST

మెట్రో రైల్లో ఇద్దరు మహిళల లడాయి. వీడియో వైరల్..

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో సీటు కోసం పంతానికి పోయిన ఇద్దరు యువతులు.. చెప్పులతో కొట్టుకునేదాకా వెళ్లారుగా..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య మెట్రో రైళ్లలో(Metro rail) జరిగిన పలు ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా(Viral Video) మారాయి. కొందరు తమకు నచ్చిన వారికి ప్రపోజ్ చేసిన వీడియోలు వైరల్ అయితే.. కొందరు ప్రయాణికుల డ్యాన్స్ తాలూకు వీడియోలు హల్ చల్ చేశాయి. మరో వ్యక్తి మెట్రోలో ప్రయాణిస్తూ తలుపులు బలవంతంగా చెరిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. పాఠకులకు ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. అయితే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువతుల మధ్య తలెత్తిన వివాదం చివరకు వారు కొట్టుకునే వరకూ వెళ్లింది.

సీటు కోసం వారిద్దరి మధ్య గొడవ(Women fight over seat) ప్రారంభమైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఓ యువతి తన చెప్పు తీసుకుని తోటి ప్రయాణికురాలిపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇది చూసిన మరో యువతి తానూ తగ్గేది లేదంటూ తన వద్ద ఉన్న వాటర్ బాటిల్‌ను గదలాగా పైకి లేపి బాహాబాహీకి సిద్ధమైపోయింది.

ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో కనిపించనప్పటికీ.. ఈ ఉదంతం మాత్రం సోషల్ మీడియాలో వీర లెవెల్లో వైరల్ అవుతోంది. సరదా కామెంట్లతో నెటిజన్లు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒకప్పుడు లేడీస్ జుట్లు పట్టుకుని కొట్టుకునే వారు ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది.. వీళ్లు కూడా ఓ రేంజ్‌లో తన్నుకునేందుకు రెడీ అయిపోతున్నారు అంటూ కొందరు తుంటరి కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఆ ఉదంతం తాలూకు పూర్తి వివరాలు వీడియోలో లేకపోవడం అనేక మందిని నిరాశ పరిచింది.

Updated Date - 2023-03-30T21:31:51+05:30 IST