Viral Video: రోడ్డు పక్కన కర్రీలు అమ్ముకుంటున్న ఈ దంపతులు ఎవరో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం.. ఓ రేంజ్‌లో ఉండాల్సిన వాళ్లు.. చివరకు ఇలా..!

ABN , First Publish Date - 2023-03-31T20:19:07+05:30 IST

రోడ్డు పక్కన కర్రీలు అమ్ముకుంటున్న ఈ దంపతులు ఎవరో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: రోడ్డు పక్కన కర్రీలు అమ్ముకుంటున్న ఈ దంపతులు ఎవరో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం.. ఓ రేంజ్‌లో ఉండాల్సిన వాళ్లు.. చివరకు ఇలా..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు వ్యాపారాల్లో భారీ నష్టాలను చవిచూశారు. అనేక మంది వీధిన పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా జీవన పోరాటం కొనసాగిస్తున్న ఓ జంట వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జతిన్ సింగ్ అనే బ్లాగర్.. ఆ జంట కథను నెట్టింట షేర్ చేశారు. వీధి పక్కన ఓ చిన్న బల్లపై కర్రీలు అమ్ముకుంటున్న ఆ జంటపై జతిన్ దృష్టి పడింది. చూడటానికి కాస్త కలిగిన వారిలాగే కనిపిస్తున్న ఆ జంట ఇలా వీధిలో ఆహారం అమ్ముకోవడం ఏంటో అతడికి అర్థం కాలేదు. అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు వారితో మాటలు కలపగా వారి గురించి అంతా తెలిసింది.

రష్మిక, తమన్నా డ్రెస్సింగ్ చూసి.. వాట్ ఏ డ్రెస్సింగ్ అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఫొటోలు వైరల్..!

తనకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, కరోనా కాలంలో అది మూత పడిందని ఆ పెద్దాయన చెప్పుకొచ్చాడు. ఆ తరువాత కొన్ని ఉద్యోగాలు చేసినా ఆశించిన ఆదాయం రాకపోవడంతో చివరకు తాము ఈ ఆదాయమార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తనకూ తన భార్యకూ వంట వచ్చు కాబట్టి ఇదే మంచి తరుణోపాయమని తమకు అనిపించిందని వివరించాడు.

కాగా, ఆ జంట వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే.. ఆ దంపతుల కథ స్ఫూర్తిమంతంగా ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న వారు ఎందరో యువజంటలకు ఆదర్శమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-04-02T16:44:01+05:30 IST