Girl Stunts: ఏం టాలెంట్ తల్లీ.. ఈ యువతి చేసిన ఫీట్లకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.. ఓ చిన్న బల్లపై నిల్చుని..!

ABN , First Publish Date - 2023-03-31T20:56:44+05:30 IST

నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న యువతి సర్కస్ ఫీట్లు..

Girl Stunts: ఏం టాలెంట్ తల్లీ.. ఈ యువతి చేసిన ఫీట్లకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.. ఓ చిన్న బల్లపై నిల్చుని..!

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంటే సర్కస్‌లకు కాస్తంత ఆదరణ తగ్గింది కానీ ఒకప్పుడు మాత్రం జనం సర్కస్‌కు వెళ్లేందుకు ఎగబడే వారు. ఊరికి సర్కస్ వస్తోందంటే చాలు ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొనేది. జంతువుల ప్రదర్శనలు, మనుషులు చేసే స్టంట్లు జనాలను తెగ ఆకట్టుకునేవి. అయితే.. ఇప్పటికీ అలాంటి ఫీట్లు చేసే వాళ్లు కనిపిస్తున్నారు. వీధుల్లోనే తమ ప్రదర్శనను ఏరాటు చేస్తూ ప్రజలు సంతోషంగా ఇచ్చినదానిని తీసుకుని పొట్టపోసుకుంటారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతోందా లేదా అన్న విషయం పక్కనపెడితే ఆ సర్కస్ ఫీట్లు మాత్రం జనాల్ని విపరీతంగా ఆకర్షి్స్తున్నాయి. ఇలా ఆశ్చర్యపరిచేలా సర్కస్ ఫీట్లు చేస్తున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతోంది.

వీడియో ఎక్కడ తీశారో క్లారిటీ లేకపోయినప్పటికీ నెటిజన్లు ఆ వీడియోలోని యువతి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. రెండు చిన్న బల్లలను ఒకదానిమీద మరొకటి వేసుకున్న ఆ యువతి తన ఫీట్లు(girl cirus stunts) ప్రారంభించింది. తన శరీరం ఓ పిండి ముద్ద అయినట్టు ఎటుపడితే అటు విల్లులా వంచుతూ చేసిన ఫీట్లకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా.. ఆమె టేబుల్‌పై నిలబడి తన శరీరాన్ని విల్లులా వెనక్కు వంచి బల్లపై ఉన్న కర్చీఫ్‌ను నోటితో అందుకున్న తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే నెటిజన్లు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక కర్చీఫ్‌తో విన్యాసం అయిపోయాక ఆమె నేలపై పడుకుని తన రెండుకాళ్లతో బల్లను గాల్లో చక్రంలా తిప్పిన తీరుకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ట్రిక్స్ నెటిజన్లకు యమాగా నచ్చేయడంతో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు ఏకంగా 82 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ దీన్ని మరింతగా వైరల్ చేస్తున్నారు. మరీ ఇంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Updated Date - 2023-03-31T20:57:46+05:30 IST