విద్యార్థులకు నీలం, నలుపు.. ఉపాధ్యాయులకు ఎరుపు... ఇలా వారు వాడే పెన్నుల్లో వ్యత్యాసం ఎందుకుంటుందంటే...

ABN , First Publish Date - 2023-05-07T12:15:12+05:30 IST

చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల(teachers) మాదిరిగా రెడ్ పెన్ను వాడాలని అనుకుంటారు. కానీ నోటు పుస్తకాలతో విద్యార్థులు రెడ్ పెన్ను(Red pen)తో రాసేందుకు టీచర్లు అనుమతినివ్వరు.

విద్యార్థులకు నీలం, నలుపు.. ఉపాధ్యాయులకు ఎరుపు... ఇలా వారు వాడే పెన్నుల్లో వ్యత్యాసం ఎందుకుంటుందంటే...

చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల(teachers) మాదిరిగా రెడ్ పెన్ను వాడాలని అనుకుంటారు. కానీ నోటు పుస్తకాలతో విద్యార్థులు రెడ్ పెన్ను(Red pen)తో రాసేందుకు టీచర్లు అనుమతినివ్వరు. దీనికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాఠశాలలో చదివే పిల్లలకు కొన్ని నిబంధనలు(Terms) ఉంటాయి. కొన్ని నియమాల ప్రకారం విద్యార్థుల అధ్యయనం జరుగుతుంటుంది. ప్రారంభంలో పిల్లలకు పెన్సిల్‌(pencil)తో రాయడం నేర్పుతారు.

నిర్దిష్ట వయస్సు, తరగతి తర్వాత వారు నీలం లేదా నలుపు సిరా పెన్నులతో రాయడానికి అనుమతిస్తారు. కానీ పిల్లలు ఎరుపు రంగు పెన్ను వాడకూడదని చెబుతారు. దీంతో పిల్లలలకు తాము ఎరుపు రంగు(red color)లో రాసే పెన్ను ఎందుకు వినియోగించకూడదని మనసులో అనుకుంటారు. దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

విద్యార్థులు సాధారణంగా నీలం, నలుపు రంగు ఇంకు పెన్నులను వాడుతుంటారు. అయితే ఉపాధ్యాయులు వీటితో పాటు ఎరుపు రంగు పెన్నును కూడా వాడుతుంటారు. ఉపాధ్యాయులు(Teachers) మాత్రమే రెడ్ పెన్నును ఎందుకు వాడతారనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎక్కడ లేదు. సాధారణంగా విద్యార్థులు తెల్ల కాగితం(White paper)పై నీలం లేదా నలుపు పెన్ను ఉపయోగించి రాస్తారు.

ఈ రంగులలోని అక్షరాలు భిన్నంగా కనిపిస్తాయి. పదాల మధ్య వ్యత్యాసం(difference) స్పష్టంగా తెలుస్తుంది. లైట్ ఇంక్ పెన్ను ఉపయోగిస్తే అక్షరాలు చదవడానికి చాలా కష్టంగా ఉండే అవకాశం(opportunity) ఉంది. విద్యార్థుల రాతలలోని తప్పులను సరిదిద్దేందుకు ఉపాధ్యాయులు రెడ్ పెన్ను ఉపయోగిస్తారు. ఉపాధ్యాయుడు(teacher) కూడా నీలం లేదా నలుపు పెన్నును ఉపయోగిస్తే, అతనికి విద్యార్థులు(students) రాసే దానికి మధ్య వ్యత్యాసం తెలియదు.

Updated Date - 2023-05-07T13:11:31+05:30 IST