బాయ్స్ హాస్టల్‌లో టీచర్ కామ క్రీడ.. గదిలో బంధించి పోలీసులను పిలిచిన విద్యార్థులు.. చివరకు..

ABN , First Publish Date - 2023-01-24T20:59:23+05:30 IST

అతను విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసే ఉపాధ్యాయుడు.. హాస్టల్‌లో పిల్లలు దారి తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత అతనిది.. అలాంటిది ఆ ఉపాధ్యాయుడే తప్పుడు పని చేస్తూ పిల్లలకు దొరికిపోయాడు.. హాస్టల్‌లో పని చేసే మహిళతో శృంగారం (Obscene Act) సాగిస్తూ పిల్లల కంట పడ్డాడు..

బాయ్స్ హాస్టల్‌లో టీచర్ కామ క్రీడ.. గదిలో బంధించి పోలీసులను పిలిచిన విద్యార్థులు.. చివరకు..

అతను విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసే ఉపాధ్యాయుడు.. హాస్టల్‌లో పిల్లలు దారి తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత అతనిది.. అలాంటిది ఆ ఉపాధ్యాయుడే తప్పుడు పని చేస్తూ పిల్లలకు దొరికిపోయాడు.. హాస్టల్‌లో పని చేసే మహిళతో శృంగారం (Obscene Act) సాగిస్తూ పిల్లల కంట పడ్డాడు.. వారిద్దరినీ పిల్లలు గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.. జిల్లా విద్యాధికారి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కోర్బా జిల్లా ఉప్రోడాకు చెందిన బాయ్స్ హాస్టల్‌లో ప్రదీప్‌ కుమార్‌ అనే వ్యక్తి పిల్లలను చదివిస్తుంటాడు. చాలా రోజులుగా అతను ఆ హాస్టల్‌లో పని చేసే మహిళతో శారీరక సంబంధం (Physical Relation)పెట్టుకున్నాడు. హాస్టల్ గదుల్లోనే ఆమెతో శృంగారం సాగించేవాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఆ మహిళను హాస్టల్‌ సూపరింటెండెంట్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో శృంగారం సాగిస్తుండగా హాస్టల్ వాచ్‌మెన్, విద్యార్థులు ఆ గదికి బయట నుంచి తాళం వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రాత్రి అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రదీప్ కుమార్‌తో పాటు మహిళను కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇద్దరినీ విచారించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. ఆయన విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

Updated Date - 2023-01-24T20:59:23+05:30 IST