Tamannaah Bhatia: కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. మిల్కీ బ్యూటీ ఘాటు స్పందనకి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-06T09:40:15+05:30 IST

సౌతిండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ హోదాని అనుభవించిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia).

Tamannaah Bhatia: కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. మిల్కీ బ్యూటీ ఘాటు స్పందనకి కారణం ఏంటంటే..
Tamannaah Bhatia

సౌతిండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ హోదాని అనుభవించిన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). ఈ నార్త్ బ్యూటీ అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయితే గత కొంతకాలంగా ఈ భామ బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో పీకల్లోతు ప్రేమ (Love)లో ఉందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిపై తాజాగా తమన్నా స్పందించింది.

Tamanna1.jpg

కేవలం సినీ సెలెబ్రిటీలకు మాత్రమే కాదు... ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హీరోయిన్‌ తమన్నా హితవు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ఆమె గురించి పలు రకాలైన ఊహాగానాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా తమన్నా భాటియా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని, త్వరలోనే వివాహం చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై తమన్నా మాట్లాడుతూ.. ‘నాకు వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వదంతులు ఎవరు, ఎందుకు పుట్టిస్తున్నారో తెలియడం లేదు. ఈ వార్తలను చదువుతుంటే నవ్వొస్తుంది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఒకటుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని ఘాటుగా సమాధానం తెలిపింది.

Tamanna2.jpg

కాగా.. టాలీవుడ్‌‌తో పాటు కోలీవుడ్‌లోని స్టార్ హీరలో సరసన నటించింది. ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంలో మిల్కీ బ్యూటీ ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది.

Updated Date - 2023-03-06T09:40:15+05:30 IST