Viral Video: ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా.. చదవకుండా ఫోన్ చూస్తోంటే.. సడన్‌గా తలుపులు తీసిన తల్లి.. ఏం చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-26T12:31:58+05:30 IST

తల్లి పిల్లాడు చదువుకుంటున్నాడా లేదా అని వచ్చి చూడగానే ఆటోమెటిగ్గా ఫోన్ పైకి పోతుంది..

Viral Video: ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదుగా.. చదవకుండా ఫోన్ చూస్తోంటే.. సడన్‌గా తలుపులు తీసిన తల్లి.. ఏం చేశాడో చూస్తే..!
smart phones

నేటి కాలంలో మొబైల్ కి దూరంగా రెండు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు. ఇక తల్లిదండ్రులైతే పిల్లలను పెంచడంలో భాగంగా ఫోన్స్ చిన్నతనం నుంచే అలవాటు చేసేస్తున్నారు. ఇదంతా సాంకేతికత అంటున్నారు కూడా. ఈమధ్యకాలంలో పెరుగు ముద్దలు తినే పసివాడి నుంచి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలమ్మ వరకూ ఫోన్, ఇంటర్నెట్ విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో పిల్లలు దానిపై ఆధారపడుతున్నారు. అప్పుడు అది చదువుల గురించి, గేమింగ్ లేదా షాపింగ్ గురించి. అన్ని పనులు కేవలం ఒక క్లిక్‌లో పూర్తవుతాయి. సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిన పిల్లల స్క్రీన్ టైమ్ తప్పకుండా పెరుగుతుంది. క్రమంగా వారు అలవాటు పడతారు. వారిని ఫోన్ నుండి దూరంగా ఉంచడం ఒక పనిగా మారుతుంది.

పెద్దలతో పాటు, పిల్లలు ఫోన్‌కు అలవాటుపడితే ఏమవుతుందో ఆలోచించండి?

ఈమధ్య సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఓ వీడియోను చూస్తున్నప్పుడు పిల్లలు ఫోన్ చూసేందుకు చేస్తున్న పనులు వాళ్ళ మీద మరింత శ్రద్ధ అవసరం అనీ, ఫోన్ కోసం వాళ్ళు ఎంతటి చీటింగ్ అయినా చేస్తారని చెబుతుంది. విషయంలోకి వెళితే.. ఈ ఫన్నీ వీడియో ఫిగెన్ (@TheFigen_) అనే ఖాతా ద్వారా x (Twitter)లో పోస్ట్ చేయబడింది. ఇది క్యాప్షన్‌లో స్మార్ట్ బాయ్ అని రాసారు.

ఇంతకీ ఈ వీడియోలో సంగతేంటంటే.. ఓ తల్లి పిల్లాడు బాగా చదువుకోవాలని గదిలో పెట్టి, అతని చేతికి పుస్తకం ఇచ్చి పని చూసుకుంటూ ఉంటుంది. మరి ఆ పిల్లాడు బుద్దిగా చదువుకుంటే ఇక చెప్పేదేముంది. స్మార్ట్ ఫోన్ కోసం మరింత స్మార్ట్ గా ఆలోచించాడు బుడ్డోడు. ఇందుకోసం తలుపుకి ఓ తాడు కట్టాడు. అదే తాడును గోడకు కట్టి.. దానికి అడ్డంగా షర్ట్ తగిలించాడు.. ఈ మధ్యలో ఫోన్ వేలాడేసి దాన్ని తలుపు తీయగానే పైకి వెళిపోయేలా ఏర్పాడు చేసాడు.


ఇది కూడా చదవండి: జుట్టుకు రంగేసుకుంటూ తెల్ల జుట్టును దాచే కష్టాలకు చెక్ పెట్టేయండి.. రాత్రి పూట దీన్ని రాసుకుని పడుకుంటే..!

తల్లి పిల్లాడు చదువుకుంటున్నాడా లేదా అని వచ్చి చూడగానే ఆటోమెటిగ్గా ఫోన్ పైకి పోతుంది.. తలుపు తోసి చూడగానే ఫోన్ పోవడం పిల్లాడు పుస్తకం వైపు చూస్తూ ఉండటం ఆ పిచ్చి తల్లి పిల్లాడి శ్రద్ధగా చదువుకోవడాన్ని చూసి మురిసిపోవడం చూస్తూంటే వీడియో చూస్తున్న నెటిజన్స్ కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ వీడియోని ఇప్పటి వరకూ 2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. 45 వేల మందికి పైగా లైక్ చేసారు. కొందరైతే స్మార్ట్ బాయ్ అని, బాగా టాలెంటెడ్ అనీ, ఆరోగ్యమైన తిండి పెట్టండి అనీ కింద కామెంట్స్ చేశారు.

Updated Date - 2023-08-26T12:31:58+05:30 IST