State Bank of India: ఈకారణం వల్ల మీ SBI సేవింగ్స్ అకౌంట్ లో డబ్బు కట్ అవుతుంది.. తెలుసుకోకుంటే నష్టపోతారు

ABN , First Publish Date - 2023-03-03T12:17:31+05:30 IST

మార్చి నెల 2వ తేదీ చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్స్ నుండి డబ్బు కట్ అయ్యింది.

State Bank of India: ఈకారణం వల్ల మీ SBI సేవింగ్స్ అకౌంట్ లో డబ్బు కట్ అవుతుంది.. తెలుసుకోకుంటే నష్టపోతారు

భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులలోకి స్టేట్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. దేశం మొత్తం మీద అత్యదిక ఖాతాలు కలిగిన బ్యాంకు కూడా స్టేట్ బ్యాంకే. మార్చి నెల 2వ తేదీ చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి డబ్బు కట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. అయితే ఇలా డబ్బు కట్ అవ్వడం వెనుక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోకపోవడం వల్లే డబ్బులు కట్ అయ్యాయని బ్యాంకిక్ రంగ నిపుణులు చెప్పుకొచ్చారు. ఇంతకూ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ల నుండి డబ్బు కట్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే..

చాలామంది ఎస్బీఐ ఖాతాదారులు మార్చి 2వ తేదీన తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి 295రూపాయలు కట్ అయ్యాయని అంటున్నారు. 'బ్యాంక్ అకౌంట్స్ నుండి డబ్బు ఎందుకు కట్ అయ్యింది? అదేమైనా పొరపాటేమో అనుకున్నాం కానీ ఆ డబ్బును బ్యాంకు తిరిగి ఖాతాలకు జమ చేయడం లేదు, ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా ఇలా కట్ అవ్వడం ఏంటి? ఎందుకిలా జరిగింది?' అంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు సర్వీస్ ఛార్జెస్ పేరుతో ఖాతాల నుండి డబ్బు కట్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఖాతాల నుండి కట్ అయిన కారణం వేరుగా ఉంది. NACH రూల్స్ కారణంగా బ్యాంకు ఖాతాల నుండి డబ్బు కట్ అయినట్లు చెబుతున్నారు. నేషనల్ ఆటోమమేటెడ్ క్లియరింగ్ హౌస్(National Automated Clearning House) అనేది NPCI ద్వారా ఏర్పాటు చేయబడింది.

Read also: ఇతడి వయసు 55 ఏళ్లు.. అయిదేళ్లుగా క్షవరం మానేశాడు.. గడ్డం పెంచేస్తున్నాడు.. అసలు కారణమేంటని అడిగితే..


సాధారణంగా ఏదైనా లోన్ తీసుకున్నా, వస్తువు కొన్నా దానికి నెలవారి చెల్లింపు EMI రూపంలో కడుతుంటాం. అలా EMI కట్టడానికి నిర్ణీత తేదీ ఉంటుంది. ఆ తేదీలోపు మీ బ్యాంక్ ఖాతాలో EMI కి సరిపడినంత డబ్బు ఉండాలి. అలా లేని పక్షంలో 250రూపాయలు ఫైన్ వేస్తారు. దీనికి 18శాతం GST గా 45రూపాయలతో కలిపి మొత్తం 250 +45=295రూపాయలు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా(SBI Savings Account) నుండి కట్ అవుతాయి. ఇలా ఖాతా నుండి డబ్బు కట్ కాకుండా ఉండాలంటే నిర్ణీత EMI తేదీకి ఒకరోజు ముందే బ్యాంకు ఖాతాలలో డబ్బు ఉండేలా చూసుకోవాలి.

Updated Date - 2023-03-03T12:17:31+05:30 IST