Sourav Ganguly: చివరి దశకు చేరుకున్న స్క్రిఫ్ట్.. గంగూలీ పాత్రలో రణ్‌బీర్..

ABN , First Publish Date - 2023-01-25T16:33:00+05:30 IST

గంగూలీపై బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు లవ్ రంజన్ (Luv Ranjan) నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సౌరవ్ తాజాగా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Sourav Ganguly: చివరి దశకు చేరుకున్న స్క్రిఫ్ట్.. గంగూలీ పాత్రలో రణ్‌బీర్..

కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్ టీమ్‌ను విజయవంతంగా నడిపిన వ్యక్తి సౌరవ్ గంగూలీ (Sourav Ganguly). క్రికెటర్‌గా జట్టుకు మరపురాని సేవలను అందించాడు. గంగూలీపై బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు లవ్ రంజన్ (Luv Ranjan) నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సౌరవ్ తాజాగా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Ranbir-Kapoor.jpg

తన బయోపిక్‌కు సంబంధించిన సినిమా స్క్రిఫ్ట్‌ను తానే రాస్తునంటూ సౌరవ్ గంగూలీ చెప్పాడు. ‘‘లవ్ రంజన్‌తో పాటు నేను కూడా చాలా బిజీగా ఉండటంతో స్క్రిఫ్ట్ పనులకు కొన్నాళ్ల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం స్క్రిఫ్ట్‌కు సంబంధించిన చర్చలు చురుగ్గా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లేను లవ్ ప్రొడక్షన్ హౌస్‌తో చర్చించాలి’’ అరి సౌరవ్ గంగూలీ తెలిపాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) సౌరవ్ పాత్రను పోషించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. గంగూలీ కూడా రణ్‌బీర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు రూమర్స్ హల్‌ చల్ చేశాయి. ఆ పాత్రకు ఎవరిని ఫైనలైజ్ చేయలేదని తాజాగా గంగూలీ పేర్కొన్నాడు. తనపై బయోపిక్ రాబోతున్నట్టు సౌరవ్ గంగూలీ 2021లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘క్రికెటే నా జీవితం. ఈ ప్రయాణం గర్వంగా నన్ను తల ఎత్తుకునేలా చేసింది. అందువల్ల నా జర్నీని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. లవ్ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది’’ అని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.

Updated Date - 2023-01-25T16:33:02+05:30 IST