బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో నటి సోనమ్ కపూర్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఏం చేయనున్నారంటే..

ABN , First Publish Date - 2023-05-06T12:42:05+05:30 IST

బ్రిటన్‌లో నేటి సాయంత్రం జరగబోతున్న ఛార్లెస్-3 పట్టాభిషేకానికి భారత ప్రభుత్వం తరుఫున అధికారికంగా ప్రాతినిధ్యం వహించేందుకు ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌

బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో నటి సోనమ్ కపూర్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఏం చేయనున్నారంటే..

బ్రిటన్‌లో నేటి సాయంత్రం జరగబోతున్న ఛార్లెస్-3 పట్టాభిషేకానికి భారత ప్రభుత్వం తరుఫున అధికారికంగా ప్రాతినిధ్యం వహించేందుకు ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌(Vice President Dhankar) ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సుదేశ్ ధన్‌కర్ కూడా ఉన్నారు.

హాజరవుతున్న భారత అతిథులు వీరే...

కామన్వెల్త్(Commonwealth) వర్చువల్ గాయక బృందాన్ని పరిచయం చేయడానికి బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరు డబ్బావాలాలు(Dabbawala) కూడా బ్రిటన్ రాజు పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలియజేసింది. అలాగే భారత్ నుంచి ఈ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతున్నవారిలో పూణెకు చెందిన ఆర్కిటెక్ట్ సౌరభ్ ఫడ్కే(Saurabh Phadke) కూడా ఉన్నారు. ఈయన చార్లెస్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఆహ్వానితుల జాబితాలో ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డు(Prince's Trust Global Award) అందుకున్న 33 ఏళ్ల గుల్షా కూడా ఉన్నారు. ఆమె ఢిల్లీకి చెందిన యువతి. ఒక కన్సల్టెన్సీ సంస్థలో పనిచేచేస్తూ, నిర్మాణ ప్రాజెక్టులకు ధరల అంచనాలను అందిస్తుంటారని బకింగ్ హామ్ ప్యాలెస్(Buckingham Palace) తెలిపింది. ఇదేవిధంగా అతిథుల జాబితాలో కెనడాకు చెందిన భారత సంతతి వ్యక్తి జే పటేల్ కూడా ఉన్నారు. టొరంటోలోని ప్రఖ్యాత సీఎన్ టవర్‌లో ఈయన చెఫ్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు ప్యాలెస్ తెలిపింది.

కైస్తవ సంప్రదాయంతో పాటు...

నేడు జరగబోయే కింగ్‌ చార్లెస్‌ 3 పట్టాభిషేకం క్రైస్తవ సంప్రదాయం(Christian tradition) ప్రకారం జరగనుంది. అయితే దీనిలో వివిధ మత సంప్రదాయాలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హిందూ ఆచారాల నిర్వహణకు ప్రతినిధిగా వ్యవహరించే నరేంద్ర బాబుభాయ్‌ పటేల్‌(Narendra Babubhai Patel) కింగ్‌ చార్లెస్‌కు సార్వభౌమ ఉంగరాన్ని అందించనున్నారు. సిక్కు వర్గానికి చెందిన ఇంద్రజిత్‌ సింగ్‌ పట్టాభిషేక గ్లవ్‌ను అందజేయనున్నారు. ముస్లింల ప్రతినిధిగా సయ్యద్‌ కమల్‌ బ్రాస్‌లేట్‌ జోడీని అందిజేస్తారు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ ఏం చేయనున్నారంటే...

ఈ కార్యక్రమానికి హిందువు అయిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) హాజరుకానున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన సైతం మిగతా అతిథులతో కలిసి ఈ వేడుకలో బైబిల్‌ చదవనున్నారు. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా ప్రధానులు బైబిల్ పఠించడం(Reading the Bible) ఎంతో కాలంగా ఆనవాయతీగా వస్తోంది.

ప్రస్తుత బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ ఆచారాన్ని కొనసాగించనున్నారు. బైబిల్‌లోని కొన్ని ఎంపిక చేసిన వాక్యాలను ఆయన పఠించనున్నారు. సాటివారికి సేవలందించడం, సర్వజనులపై క్రీస్తు ప్రేమను కురిపించడం మొదలైనవి దీనిలో ఉండనున్నాయి. లండన్‌(London)లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబీకులు, ప్రభుత్వ పెద్దలతో పాటు దేశవిదేశాలకు చెందిన 2 వేల మంది అతిథులు(guests) హాజరుకానున్నారు. 100 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తరిలి వస్తున్నారు.

Updated Date - 2023-05-06T12:50:06+05:30 IST