Salaar: శ్రుతీహాసన్‌ పనైపోయింది!

ABN , First Publish Date - 2023-02-24T11:17:32+05:30 IST

శ్రుతీహాసన్‌ (Shruti Haasan) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘సలార్‌’ (salaar)చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel)దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

Salaar: శ్రుతీహాసన్‌ పనైపోయింది!

శ్రుతీహాసన్‌ (Shruti Haasan) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘సలార్‌’ (salaar)చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel)దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ ఆద్య అనే పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే! అయితే గురువారంతో ఆమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందట. (Shruti Haasan) Completed shoot of salaar) ఆ విషయాన్ని శ్రుతీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నన్ను మీ ఆద్యగా మార్చుకున్నందుకు ప్రశాంత్‌ నీల్‌కు కృతజ్ఞతలు. డార్లింగ్‌ ప్రభభాస్‌కూ ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో భాగం కావడం క్రేజీగా ఉంది. ఓ కుటుంబం జర్నీలా సాగింది’’ అని శ్రుతీహాసన్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-02-24T11:32:30+05:30 IST