Pratik Vitthal Mohite: పెళ్లికి హైట్‌తో పనేముంది.. ఎలాంటోడనేదే మేటర్.. అంతేగా మామాబ్రోస్..!

ABN , First Publish Date - 2023-03-18T13:28:20+05:30 IST

మొదటిసారిగా 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు.

Pratik Vitthal Mohite: పెళ్లికి హైట్‌తో పనేముంది.. ఎలాంటోడనేదే మేటర్.. అంతేగా మామాబ్రోస్..!
bodybuilder

మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల బాడీబిల్డర్ తనలాగే పొట్టిగా ఉన్న 22 ఏళ్ల జయను వివాహం చేసుకున్నాడు. 3 అడుగుల 4 అంగుళాలతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్ ప్రతీక్ విఠల్ మోహితే 4 అడుగుల 2 అంగుళాల పొడవు ఉన్న జయను వివాహం చేసుకున్నాడు. అతను 2021లో "ప్రపంచంలో అత్యంత పొట్టి పోటీ బాడీబిల్డర్‌గా‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రతీక్ తన భాగస్వామిని నాలుగేళ్ల క్రితం కలిశాడని, తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని, ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలలో, అతను వరుడిలా దుస్తులు ధరించి, వాహనంపై సంతోషంగా డ్యాన్స్ చేస్తూ, వేడుకలు చేసుకోవడానికి ప్రజలు అతని చుట్టూ గుమిగూడారు.

ప్రతీక్ విఠల్ మోహితే 2012లో తన బాడీబిల్డింగ్ వృత్తిని ప్రారంభించాడు. మొదట్లో అతని పరిమాణం కారణంగా వ్యాయామాలు చేయడం, పరికరాలను పట్టుకోవడంలో చాలా కష్టపడ్డాడు. పట్టు వదలకుండా జిమ్‌లో కష్టపడ్డాడు. ప్రతీక్ మొదటిసారిగా 2016లో బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్నాడు. అతని కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తను ఇంతటి విజయాన్ని అందుకున్నానని చెప్పాడు.

ఇది కూడా చదవండి: ఆగకుండా దగ్గు వస్తూనే ఉందా..? ‘ఈ దగ్గుకో దణ్ణం బాబోయ్’ అని బాధపడేవాళ్లు ఇవి ట్రై చేయండి..!

అతని స్నేహితుల సలహాతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కోసం దరఖాస్తు చేశాడు. 2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి పోటీ బాడీబిల్డర్‌గా ఎంపికయ్యాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సాధించడం తన కల అని, దానిని సాధించడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ప్రతీక్ విఠల్ మోహితే చెప్పాడు. జయను పెళ్ళి చేసుకోవడం అనేది ఆమె నా శరీరాకృతి చూసి ఇష్టపడింది. ఇద్దరం కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం అని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Updated Date - 2023-03-18T13:28:20+05:30 IST