Shocking Video: నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టిన 6 వీధి కుక్కలు.. పారిపోతున్నా వెంటపడి మరీ అటాక్.. ఆ తల్లి రాకపోయి ఉంటే..!

ABN , First Publish Date - 2023-04-14T13:18:34+05:30 IST

బాలుడిపై కుక్కల దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

Shocking Video: నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టిన 6 వీధి కుక్కలు.. పారిపోతున్నా వెంటపడి మరీ అటాక్.. ఆ తల్లి రాకపోయి ఉంటే..!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో వీధి కుక్కలు చిన్నారులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో(Nagpur) జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా(Viral Video) మారింది. ఓ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా ఓ కుక్క వచ్చి దాడి చేస్తుంది. ఆ వెంటనే ఇతర శునకాలు కూడా బాలుడిని టార్గెట్ చేశాయి. చిన్నారిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేయడం ప్రారంభించాయి. ఓ కుక్క టీ షర్ట్ పట్టి పిల్లాడి నేలపై ఈడ్చింది(Dog attacks kid). దీంతో.. తీవ్ర భయాందోళనకు లోనైన బాలుడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు.

అయితే.. పరిస్థితి చేయిదాటిపోక ముందే బాలుడి తల్లి వచ్చేస్తుంది. పెద్ద పెట్టున కేకలు వేస్తూ, రాళ్లు విసురుతూ కుక్కలను చెదరగొట్టి పిల్లాడిని పెను ప్రమాదం నుంచి రక్షించుకుంది. ఏప్రిల్ 11న ఈ ఘటన జరగ్గా వీడియో వైరల్‌గా మారింది. కాగా.. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాట. దీంతో.. అతడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారట. యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమయానికి తల్లి రాకపోయి ఉంటే బిడ్డ పరిస్థితి ఏమైపోయి ఉండేదో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-04-14T13:18:34+05:30 IST