Sharwanand 35: ఫంకీ లుక్‌ అదిరింది!

ABN , First Publish Date - 2023-03-06T17:58:02+05:30 IST

‘ఒకే ఒక జీవితం’తో తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్‌ ట్రీట్‌ ఇచ్చారు శర్వానంద్‌. తదుపరి చిత్రం కోసం తన రూట్‌ మార్చారు. రెగ్యులర్‌ కథలు కాకుండా కాస్త భిన్నమైన కథ ఎంచుకునే దిశగా ఆయన వెళ్తున్నారు.

Sharwanand 35: ఫంకీ లుక్‌ అదిరింది!

‘ఒకే ఒక జీవితం’తో (Oke oka Jeevitham) తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్‌ ట్రీట్‌ ఇచ్చారు శర్వానంద్‌ (Sharwanand). తదుపరి చిత్రం కోసం తన రూట్‌ మార్చారు. రెగ్యులర్‌ కథలు కాకుండా కాస్త భిన్నమైన కథ ఎంచుకునే దిశగా ఆయన వెళ్తున్నారు. తాజా చిత్రం కోసం కేలరీలను కరగదీసేందుకు కసరత్తులు చేస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శర్వానంద్‌ 35వ (Sharwanand 35)చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ శ్రీరామ్‌ ఆదిత్య (Sriram adhitya) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో శర్వానంద్‌ ఫంకీ, స్లీక్‌, ఎలిగెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. యూనిక్‌ పాయింట్‌తో ఫ్యూచరిస్టిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పోస్టర్‌లో చూపిన దాన్ని బట్టి చూస్తే లండన్‌లో చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే శర్వానంద్‌ ఓ ఇంటివాడు కానున్నారు. ఇటీవల రక్షితారెడ్డితో ఆయన శర్వానంద్‌ జరిగింది. (HBD SHARWANAND)

Updated Date - 2023-03-06T18:00:28+05:30 IST