Ram Charan: కొండారెడ్డి బురుజులో ‘ఆర్‌సీ15’ షూటింగ్.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2023-02-10T15:31:09+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Ram Charan: కొండారెడ్డి బురుజులో ‘ఆర్‌సీ15’ షూటింగ్.. వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వరల్డ్ వైడ్‌గాను విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందువల్ల ఆయన నుంచి వచ్చే నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో నటిస్తున్నారు. కియారా అడ్వాణీ (Kiara Advani), అంజలి హీరోయిన్ పాత్రలను చేస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ15’ (RC15) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో జరుగుతుంది.

కర్నూలు అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చే కొండారెడ్డి బురుజు‌లో ప్రస్తుతం ‘ఆర్‌సీ15’ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి రామ్ చరణ్ వేకువజామునే అక్కడకు చేరుకున్నారు. చెర్రీ ఈ కోట మీదికి ఎక్కడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులందరు విపరీతంగా వాటిని షేర్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 60శాతానికి పైగా పూర్తయినప్పటికీ టైటిల్‌ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ను మార్చి 27న వెల్లడించనున్నట్టు సమాచారం అందుతుంది.

‘ఆర్‌సీ15’ లో రామ్ చరణ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐఏఏస్ ఆఫీసర్‌తో పాటు మరో పాత్రను చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. చరణ్ ఐఏఏస్ ఆఫీసర్ పాత్రకు కియారా, మరో పాత్రకు అంజలి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. శంకర్ ఒకేసారి ‘ఇండియన్ 2’, ‘ఆర్‌సీ15’ చిత్రాలకు దర్శకత్వం వహిస్తుండటంతో నెలలో సగం రోజులు మాత్రమే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2023-02-10T15:31:11+05:30 IST