Pathaan: పాకిస్తాన్‌లో అక్రమ స్క్రీనింగ్స్.. హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వం ..

ABN , First Publish Date - 2023-02-04T18:15:15+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

Pathaan: పాకిస్తాన్‌లో అక్రమ స్క్రీనింగ్స్.. హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వం ..

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.720కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘పఠాన్’ ఫీవర్ పాకిస్తాన్‌ను తాకింది. కొన్నాళ్ల క్రితం పాక్.. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ఫలితంగా ఆ దేశంలో ‘పఠాన్’ స్క్రీనింగ్స్‌ను అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. అక్కడ షారూఖ్ ఖాన్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో అక్రమ స్క్రీనింగ్స్‌కు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు.

‘పఠాన్’ టిక్కెట్స్‌ను 900 పాకిస్తాన్ రూపాయాలకు విక్రయిస్తున్నప్పటికీ స్క్రీనింగ్స్ హౌస్‌ఫుల్ కావడం చెప్పుకోదగ్గ విశేషం. సినిమాను అక్రమంగా ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి రావడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని చిత్రాన్ని ఆపేశారు. ప్రభుత్వ అనుమతి ఉన్న మూవీలను మాత్రమే ప్రదర్శించాలని సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్స్ సెన్సార్ (ఎస్‌బీఎఫ్‌సీ) కోరింది. బహిరంగంగా ఇటువంటి స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మూడేళ్ల జైలు శిక్షతో పాటు, లక్ష పాకిస్తాన్ రూపాయాలను జరిమానాగా విధిస్తామని హెచ్చరించింది. ‘పఠాన్’ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. కింగ్ ఖాన్ ఐదేళ్ల తర్వాత వెండి తెరపై మెరవడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులను చెరిపేసింది. బాలీవుడ్‌ ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవనుంది. ఇక షారూఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘జవాన్’ లో నటిస్తున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-02-04T18:15:17+05:30 IST