Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

ABN , First Publish Date - 2023-01-29T17:45:14+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తిరగరాస్తున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది.

Pathaan: రికార్డులు సృష్టిస్తున్న ‘పఠాన్’.. ప్రతి రోజు 100కోట్ల వసూళ్లు..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తిరగరాస్తున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.400కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం ఇండియాలో రూ.265కోట్లు, ఓవర్సీస్‌లో రూ.164కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాలుగు రోజుల్లోనే రూ.429కోట్ల కలెక్షన్స్‌ను సాధించి సంచలనం సృష్టించింది. కింగ్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత కనిపించడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను మించి ఈ చిత్రం రాకెట్ వేగంతో వసూళ్లను సాధించింది.

షారూఖ్ ఖాన్ చివరగా ‘జీరో’ (Zero) లో కనిపించాడు. ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఫలితంగా కింగ్ ఖాన్ చిత్రాల నుంచి విరామం తీసుకొన్నాడు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత ‘పఠాన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది.

Updated Date - 2023-01-29T17:46:26+05:30 IST