అది తీరమే లేని సాగరం... ఆ నీరు ఎలా ఉంటుందో... అది వేటికి ఆవాసమో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!

ABN , First Publish Date - 2023-04-09T12:05:47+05:30 IST

అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే సర్గాసో సముద్రానికి(sargasso sea) తీరమే లేదు. ప్రపంచంలో తీరం లేని ఏకైక సముద్రం ఇదే. ఈ నీటి జలాశయం భౌగోళిక మ్యాప్‌(Geographical map)లో ఎక్కడా భూమిని తాకదు.

అది తీరమే లేని సాగరం... ఆ నీరు ఎలా ఉంటుందో... అది వేటికి ఆవాసమో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!

అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే సర్గాసో సముద్రానికి(sargasso sea) తీరమే లేదు. ప్రపంచంలో తీరం లేని ఏకైక సముద్రం ఇదే. ఈ నీటి జలాశయం భౌగోళిక మ్యాప్‌(Geographical map)లో ఎక్కడా భూమిని తాకదు. సర్గాసో సముద్రం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రానికి చెందిన గల్ఫ్ స్ట్రీమ్‌కు పశ్చిమాన కానరీ కరెంట్‌కు తూర్పున ఉంది.

సర్గాసో ద్వీపం రహస్యమైన బెర్ముడా ట్రయాంగిల్‌(Bermuda Triangle)కు చాలా దగ్గరగా ఉన్నందున ఇక్కడకు వెళ్లడం ఎంతో ప్రమాదకరం. బెర్ముడా ట్రయాంగిల్ ఒక త్రిభుజాకార సముద్ర ప్రాంతం, ఇక్కడ భారీ ఓడలు, విమానాలు(Airplanes) అదృశ్యమవుతాయి. సర్గాసో సముద్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఒకరకమైన గడ్డి ఇక్కడ పెద్ద మొత్తంలో పెరుగుతుంది. దీనికి ఈ సర్గాసో గడ్డి(Sargasso grass) అని అంటారు. ఈ గడ్డి సముద్రపు ఉపరితలంపై తేలుతూ కనిపిస్తుంది. ఈ గడ్డి ఇక్కడి జలచరాలకు(aquatic life) ఆహార వనరు. ఈ సాగరం వివిధ రకాల చేపలు, పీతలు, తాబేళ్లకు నిలయం. అట్లాంటిక్ సముద్రం(Atlantic Ocean)లో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, సర్గాసో సముద్రపు నీరు వెచ్చగా ఉండటం విశేషం.

Updated Date - 2023-04-09T13:01:01+05:30 IST