Samantha: విజయ్ అభిమానులకు క్షమాపణలు

ABN , First Publish Date - 2023-02-01T15:01:50+05:30 IST

గ్లామర్ పాత్రలు పోషిస్తూనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి సమంత (Samantha). ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా చిత్రాలకు బ్రేక్ ఇచ్చారు.

Samantha: విజయ్ అభిమానులకు క్షమాపణలు

గ్లామర్ పాత్రలు పోషిస్తూనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి సమంత (Samantha). ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా చిత్రాలకు బ్రేక్ ఇచ్చారు. ఆమె నటిస్తున్న మూవీస్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. సామ్ తాజాగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్‌ను ప్రారంభించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో సామ్ తెలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వడం లేదని ఊహాగానాలు చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ఈ వదంతులపై సామ్ స్పందించారు.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత హీరో, హీరోయిన్స్‌గా ‘ఖుషి’ (Kushi) సినిమా రూపొందుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. సమంత కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. తాజాగా ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించడంతో ఓ అభిమాని ఖుషి ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రశ్నించారు. అందుకు సామ్ రిప్లై ఇస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ‘‘విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నా క్షమాపణలు. ‘ఖుషి’ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది’’ అని సమంత పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు విజయ్ దేవర కొండ రిప్లై ఇచ్చారు. ‘‘నువ్వు పూర్తిగా కోలుకోని నవ్వులు చిందిస్తూ వచ్చే వరకు మేం అందరం వేచి చూస్తాం’’ అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ‘ఖుషి’ పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Updated Date - 2023-02-01T15:05:11+05:30 IST