Saif Ali Khan: మా బెడ్‌ రూమ్‌కి వచ్చేయండి... సైఫ్‌ అసహనం!

ABN , First Publish Date - 2023-03-03T18:31:06+05:30 IST

సెలబ్రిటీలు కనిపిస్తే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమాన హీరోలు కనిపిస్తే సెల్ఫీలు అంటూ ఫ్లాష్‌లతో కెమెరాలు క్లిక్‌మనిపించకుండా ఉండలేరు.

Saif Ali Khan: మా బెడ్‌ రూమ్‌కి వచ్చేయండి... సైఫ్‌ అసహనం!

సెలబ్రిటీలు కనిపిస్తే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమాన హీరోలు కనిపిస్తే సెల్ఫీలు అంటూ ఫ్లాష్‌లతో కెమెరాలు (Film celebs issues) క్లిక్‌మనిపించకుండా ఉండలేరు. ఇక మీడియా కెమెరామెన్లు అయితే వారి ప్రతి కదలికలను తమ కెమెరాల్లో బంధించాలనుకుంటారు. అది కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది. కొందరు హెచ్చరిస్తుంటారు.. కొందరు అభిమానుల చేష్టలను ఏమీ అనలేక ఓపికగా భరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌(Saif ali khan), కరీనా కపూర్‌ (kareena kapoor) ఓ ప్రైవేట్‌ పార్టీకి వెళ్లారు. మలైకా అరారో తల్లి జోయ్‌సీ 70వ పుట్టినరోజు వేడుకకు వీరు జంటగా హాజరయ్యారు. పార్టీ అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరిన ఈ జంటను కెమెరామెన్లు వెంబడించి ఫొటోలు తీయసాగారు. దీనితో విసుగెత్తిని సైఫ్‌ ‘ఓ పని చేయండి, మా బెడ్‌రూమ్‌లోకి కూడా (saif fire on Photographers) వచ్చేయండి?’ అని సీరియస్‌గా చెప్పాడు. అది విన్న కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్‌ ‘సైఫ్‌ సర్‌, మీరంటే మాకెంతో ఇష్టం’ అని అరిచాడు. దీనికి సైఫ్‌ ‘మాకూ మీరంటే ఎంతో ఇష్టం’ అని రిప్లై ఇస్తూ వెళ్లిపోయారు. తాజాగా ఆయన ‘విక్రమ్‌ వేద’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో రావణుడిగా నటిస్తున్నాడు.

Updated Date - 2023-03-03T18:31:06+05:30 IST