RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు

ABN , First Publish Date - 2023-01-16T13:38:27+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే.

RRR: జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. మరో రెండు అంతర్జాతీయ అవార్డులు
RRR

‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే. థియేటర్స్‌లో విడుదలై రూ.1200 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది. అనంతరం ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు వచ్చింది. తాజాగా ఈ మూవీకి మరో రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.

ఉత్తమ పాట, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో రెండు క్రిటిక్స్‌ ఛాయిస్‌ (Critics Choice Awards) అవార్డులు అందుకుంది. ‘నాటు నాటు’ పాటకే బెస్ట్‌ సాంగ్‌ అవార్డు రావడం ఇక్కడ విశేషం. 28వ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు ఫంక్షన్‌లో రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ అవార్డులను అందుకున్నారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఓ వీడియోను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.


అలాగే.. ఈ విషయాన్ని తెలుపుతూ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు (Critics Choice Awards) యాజమాన్యం సైతం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అందులో.. ‘ఉత్తమ విదేశీ చిత్రంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు అందుకున్నందుకు.. RRR మూవీ నటీనటులు, సిబ్బందికి కంగ్రాట్స్’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-01-16T13:43:23+05:30 IST