Cirkus: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-02-02T20:15:49+05:30 IST

రోహిత్ తాజాగా ‘సర్కస్’ (Cirkus) కు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ అయింది.

Cirkus: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్స్‌లో రోహిత్ శెట్టి (Rohit Shetty) ఒకరు. ‘సింగమ్’ ప్రాంచైజీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తారని ఆయనకు పేరుంది. అందువల్ల ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రోహిత్ తాజాగా ‘సర్కస్’ (Cirkus) కు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ అయింది.

‘సర్కస్’ పీరియాడిక్ కామెడీగా తెరకెక్కింది. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా నటించారు. డబుల్ రోల్‌ పోషించారు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టులేకపోయింది. ఈ సినిమా ఓటీటీలోకి త్వరలోనే రాబోతుంది. ఫిబ్రవరి 17 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. మాములుగా కొన్ని సినిమాలు థియేటర్స్‌లో ప్లాఫ్ అయినప్పటికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం రికార్డు స్థాయిలో వీక్షణలను రాబడుతున్నాయి. అయితే, ‘సర్కస్’ ఆ ఫీట్‌ను రిపీట్‌ను చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే.

Updated Date - 2023-02-02T20:18:36+05:30 IST