Ritika singh: దయచేసి గుండె బద్దలయ్యే పనులు చేయొద్దు!

ABN , First Publish Date - 2023-02-26T15:46:06+05:30 IST

బాక్సింగ్‌ నేపథ్యంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘గురు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు రితికా సింగ్‌. తదుపరి తెలుగులో ‘నీవెవరో’, తమిళంలో ‘శివలింగ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ‘ఇన్‌కార్‌’, ‘పిచ్చైకారన్‌-2’తో పాటు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు రితిక.

Ritika singh: దయచేసి గుండె బద్దలయ్యే పనులు చేయొద్దు!

బాక్సింగ్‌ నేపథ్యంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘గురు’ (Guru) సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు రితికా సింగ్‌(Ritika singh). తదుపరి తెలుగులో ‘నీవెవరో’(Neevevaro), తమిళంలో ‘శివలింగ’ (sivalinga) చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ‘ఇన్‌కార్‌’, ‘పిచ్చైకారన్‌-2’తో పాటు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు రితిక. ‘ఇన్‌కార్‌’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రితికా సింగ్‌ (Ritika singh emotional) ఆసక్తికరంగా మాడ్లాడారు. హీరోయిన్లపై వచ్చే మీమ్స్‌, ట్రోల్స్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను అసహ్యంగా ఎడిట్‌ చేసి డబుల్‌ మీనింగ్‌ వచ్చేలా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. నేను ఈ మఽధ్యన ఇలాంటివి చాలా ఫేస్‌ చేశా. అలాంటి కామెంట్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. మీకే నాకు నాకూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. వారికి ఎమోషన్స్‌ ఉంటాయి. నా ఫోటోలు అలా చూసి వాళ్లు ఏమనుకుంటారు. అలాంటి చూసినప్పుడు వాళ్ల గుండె బద్దలవుతుంది. దయ చేసిన ఇలాంటి చెత్త మీమ్స్‌ చేసేటప్పుడు ఓసారి ఆలోచించండి. సెలబ్రిటీలకు ఫ్యామిలీలు ఉంటాయి.. లేని పోని మాటలు మాట్లాడితే వాళ్ల మనసు బాధ పడుతుందని గమనించండి’’ అంటూ రితికా భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - 2023-02-26T16:02:09+05:30 IST