Share News

Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-16T19:32:59+05:30 IST

రహదారుల మధ్యలో డివైడర్లపై చెట్లు ఎందుకు నాటుతారనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే, ఈ కథనం మీకోసమే!

Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మనందరం నిత్యం వాహనాల్లో ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. ఇక హైవేలపై వెళ్లిన ప్రతిసారీ డివైడర్‌పై చెట్లు కనిపిస్తుంటాయి. చూడటానికి ఇవి అందంగా ఉంటాయి గానీ అసలు ఇలా రోడ్డు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో ఎప్పుడైనా డౌటొచ్చిందా?(Reasons for planting trees on dividers) అయితే ఈ కథనం మీకోసమే!

పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు పెంచుతారన్న విషయం తెలిసిందే. చెట్లు అధికంగా ఉన్న చోట కాలుష్యం తగ్గుతుంది. దీనితో పాటూ అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్నారు. సాధారణంగా రోడ్డు మధ్య కొంత భాగాన్ని ఖాళీగా ఉంచేస్తారు. అక్కడ మట్టి తప్ప మరేమీ ఉండదు. కాంక్రీట్, తారు వంటివి వేయరు. నేలలోకి వాన నీరు చేరాలనే ఉద్దేశంతోనే రోడ్డు మధ్య ఖాళీ జాగా ఉంచుతారట. ఆ తరువాత అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి వాటిపై మొక్కలు పెంచుతారని నిపుణులు చెబుతున్నారు.

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్


పచ్చదనం కంటికి ఇంపుగా ఉండి, ఉల్లాసాన్ని ఇస్తుంది. మనసు, శరీరం చల్లబడిన భావన కలుగుతుంది. దీంతో, డ్రైవర్లు, ప్యాసింజర్లు ఎండ, కాలుష్యం, బడలిక నుంచి కొద్దిగా రిలీఫ్ పొందుతారు. ఈ కారణంగానే హైవేలపై కూడా చెట్లను ఏర్పాటు చేస్తారు. దీంతో, ఉల్లాసభరిత వాతావరణంలో ప్రయాణం చేసే అవకాశం దక్కుతుంది.

అయితే, రోడ్డుకు మధ్యగా చెట్లను ఏర్పాటు చేయడానికి భద్రతాపరమైన కారణాలే ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతిని ఈ చెట్లు అడ్డుకుంటాయని, తద్వారా డ్రైవర్ చూపుకు ఇబ్బంది రానీయకుండా ప్రమాదాలను నివారిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల హైబీమ్‌‌ వెలుతురును అడ్డుకోవడంతో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

Viral: భార్య ఎఫైర్ గురించి తెలిసి భర్త సంచలన నిర్ణయం.. ఆమెకు విముక్తి కల్పించాలని..

Viral: బాబోయ్.. షమీ 7 వికెట్లు తీస్తాడని సరిగ్గా ఒక రోజు ముందే చెప్పేశాడు! ఇతడు ఎవరంటే..

Updated Date - 2023-11-16T19:34:08+05:30 IST