RaoRamesh: ఈ సినిమాలో అతని రోల్ తెలిస్తే షాక్ అవుతారు...

ABN , First Publish Date - 2023-02-24T11:09:21+05:30 IST

దర్శకుడు లక్షణ్ కార్య ఇప్పుడు ఒక కథని రాసుకొని, దానికి నటుడు రావు రమేష్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి అతన్ని అప్రోచ్ అవటం జరిగింది. కథ విని, రావు రమేష్ ఈ సినిమాని ఒకే చేసినట్టుగా చెపుతున్నారు.

RaoRamesh: ఈ సినిమాలో అతని రోల్ తెలిస్తే షాక్ అవుతారు...

క్యారెక్టర్ నటులు చాలా సందర్భాల్లో చాల సినిమాల విజయానికి తోడ్పడుతూ వుంటారు. అప్పట్లో ఎస్.వి. రంగారావు (SV Ranga Rao) తరువాత రావు గోపాల రావు (Rao Gopala Rao), నాగభూషణం (Nagabhushanam), కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) తరువాత ప్రకాష్ రాజ్ (Prakash Raj), ఇప్పుడు రావు రమేష్ (Rao Ramesh) ఇలా చాలామంది వున్నారు. ఈ క్యారెక్టర్ నటులు అందరూ కొన్ని సినిమాలల్లో కథానాయకుడితో సమానంగా నటించి సినిమా విజయానికి తోడ్పడే వారు. దర్శకుడు లక్షణ్ కార్య (Lakshman Karya) ఇప్పుడు ఒక కథని రాసుకొని, దానికి నటుడు రావు రమేష్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి అతన్ని అప్రోచ్ అవటం జరిగింది. కథ విని, రావు రమేష్ ఈ సినిమాని ఒకే చేసినట్టుగా చెపుతున్నారు. ఈ సినిమాకి 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' అని పేరు పెట్టారు. ఇందులో రావు రమేష్ టైటిల్ రోల్ వేస్తున్నారని ఒక ప్రకటనలో చిత్ర నిర్వాహకులు చెప్పారు.

rao-ramesh.jpg

వైవిధ్యమయిన పాత్రలు వేస్తున్న, విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి ఈ సినిమాతో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది రెగ్యులర్ కథానాయకుడు రోల్ కాదని, ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా అని దర్శకుడు చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ వున్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారని, అందువల్లనే ఈ సినిమా నిర్వాహకులు కథని నమ్ముకొని, ఆ కథకి రావు రమేష్ సరిఅయిన న్యాయం చేస్తాడని నమ్మి వెళుతున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది అని చెపుతున్నారు.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ 'పుష్ప', 'కెజియఫ్', 'ధమాకా' తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంతకు ముందు 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమా చేశారు. ''వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని దర్శకుడు చెప్పారు.

Updated Date - 2023-02-24T11:13:28+05:30 IST