Ram Charan: నాన్‌స్టాప్‌ డ్యాన్స్‌కు శంకర్ ఫిదా.. సింగిల్ టేక్‌లోనే ఓకే..

ABN , First Publish Date - 2023-02-17T16:13:58+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

Ram Charan: నాన్‌స్టాప్‌ డ్యాన్స్‌కు శంకర్ ఫిదా.. సింగిల్ టేక్‌లోనే ఓకే..

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ 15’ (RC15)అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

‘ఆర్‌సీ 15’ కోసం భారీ స్థాయిలో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ పాటలో చెర్రీ అదిరిపోయే స్టెప్స్ వేసి డైరెక్టర్ శంకర్‌ను ఫిదా చేశారు. పాటలో భాగంగా రామ్ చరణ్ నాన్‌స్టాప్‌గా 80 సెకండ్స్ పాటు డ్యాన్స్ చేశారు. ఈ స్టెప్స్ అన్ని కూడా మొదటి టేక్‌లోనే ఒకే అయ్యాయి. రామ్ చరణ్ చేసిన డ్యాన్స్‌ను చూసి సెట్‌లో ఉన్న వారందరు సర్‌ప్రైజ్ అయ్యారు. ‘ఆర్‌సీ 15’ షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో జరుగుతుంది. అంతకు ముందు చార్మినార్, కొండారెడ్డి బురుజు వంటి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా కనిపించనున్నారు. తండ్రి పాత్రకు అంజలి జోడీగా కనిపించనున్నారు. కొడుకు పాత్రకు కియారా అడ్వాణీ జంటగా కనిపిస్తారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-17T16:16:18+05:30 IST