Bhola Shankar: రాఘవేంద్రరావు సెంటిమెంట్‌ రిపీట్‌?

ABN , First Publish Date - 2023-02-11T17:26:00+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన అదే ఎనర్జీతో ‘భోళాశంకర్‌’(Bhola shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Bhola Shankar: రాఘవేంద్రరావు సెంటిమెంట్‌ రిపీట్‌?

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన అదే ఎనర్జీతో ‘భోళాశంకర్‌’(Bhola shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తమిళ హిట్‌ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ ఇది.. మెహర్‌ రమేశ్‌ (megar ramesh)దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ‘భోళాశంకర్‌’ మూవీ కోసం వేసిన కోల్‌కతా సెట్‌లో ప్రస్తుతం దాదాపు వంద మందితో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ సెట్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సందర్శించారు(Raghavendrarao visits bholashankar sets). ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియ ద్వారా వెల్లడించారు. టీమంతా కలిసి ఆయనతో దిగిన ఫొటోను ‘భోళా శంకర్‌’ చిత్ర బృందం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. భోళా శంకర్‌ సెట్‌ నుంచి మ్యాజికల్‌ ఫ్రేమ్‌ అంటే పోస్ట్‌ చేసిన ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘లెజెండరీ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ‘బోళా శంకర్‌’ సెట్స్‌ను సందర్శించి.. యూనిట్‌కు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించారు.

గతంలో చిరంజీవి నటించిన ‘చూడాలనివుంది’ సినిమాలో ‘రామ్మా చిలకమ్మా’ సాంగ్‌ సెట్స్‌లో ఆయన అడుగుపెట్టారు. అది సూపర్‌ హిట్‌ అయింది. మరి ఇప్పుడు’ అంటూ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. ఫొటో ఫ్రేమ్‌లో చిరంజీవి, రాఘవేంద్రరావుతోపాటు కీర్తి సురేశ్‌, శేఖర్‌ మాస్టర్‌, అనీ మాస్టర్‌, రఘుబాబు, వెన్నెల కిశోర్‌; సురేఖావాణి తదితరులు ఉన్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. (chudalaniundi sentiment for Bhola shankar)

Updated Date - 2023-02-11T17:26:26+05:30 IST