Prabhas: ట్రెండింగ్‌లో ప్రారంభం కాని ప్రాజెక్ట్‌!

ABN , First Publish Date - 2023-02-18T01:13:37+05:30 IST

ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. గతేడాది ఈ సినిమా ప్రకటన బయటకొచ్చింది. అయితే షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. షూటింగ్‌ ప్రారంభం కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: ట్రెండింగ్‌లో ప్రారంభం కాని ప్రాజెక్ట్‌!

ప్రభాస్‌(Prabhas) హీరోగా సందీప్‌రెడ్డి వంగా (sandeep reddy vanga) దర్శకత్వం వహించనున్న చిత్రం ‘స్పిరిట్‌’.(spirit) గతేడాది ఈ సినిమా ప్రకటన బయటకొచ్చింది. అయితే షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. షూటింగ్‌ ప్రారంభం కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా అప్‌డేట్‌ వచ్చిన ప్రతిసారి ట్విట్టర్‌లో ‘స్పిరిట్‌ హ్యాష్‌ట్యాగ్‌’ (#Spirit) ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే! తాజాగా సందీప్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడటంతో మరోసారి ఈ టైటిల్‌ ట్రెండ్‌ అయింది. ‘‘యానిమల్‌’ తర్వాత ‘స్పిరిట్‌’ సినిమా చేయబోతున్నా. ప్రభాస్‌ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకుంటానని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ వీడియో క్లిప్స్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆనందిస్తున్నారు అభిమానులు. ఈ ప్రాజెక్ట్‌పై సందీప్‌ బలమైన నమ్మకంతో ఉన్నారని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న సందీప్‌ ఆ చిత్రాన్ని హిందీలో కబీర్‌సింగ్‌ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా ప్రాజెక్ట్‌ మొదలుపెడతారు. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో తొలిసారి ప్రభాస్‌ ఖాకీ దుస్తులు వేసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, సలార్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - 2023-02-18T01:21:36+05:30 IST