Prabhas Marriage: కృతి సనన్, ప్రభాస్ ఎంగేజ్ మెంట్: ఉమైర్ సంధు

ABN , First Publish Date - 2023-02-06T11:01:33+05:30 IST

గత కొన్ని రోజులుగా ప్రభాస్ (#PrabhasMarriage) పెళ్లి మీద చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు ప్రభాస్ తో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ (#KritiSanon) పేరు మాత్రం బాగా వినపడుతోంది.

Prabhas Marriage: కృతి సనన్, ప్రభాస్ ఎంగేజ్ మెంట్: ఉమైర్ సంధు

గత కొన్ని రోజులుగా ప్రభాస్ (#PrabhasMarriage) పెళ్లి మీద చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు ప్రభాస్ తో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ (#KritiSanon) పేరు మాత్రం బాగా వినపడుతోంది. ఆమధ్య ప్రభాస్ ఒక రియాలిటీ షో కి వచ్చినపుడు ప్రభాస్ పెళ్లి టాపిక్ మీదే (#PrabhasMarriage) చాలా నడిచింది. అప్పుడు కూడా ప్రభాస్ (Prabhas) ఏమీ చెప్పకుండా దాటేశాడు. అయితే ఆదిపురుష్ (#Aadipurush) ప్రచారాల్లో భాగంగా ప్రభాస్, కృతి సనన్ చాలా దగ్గరగా వున్నారని, కృతి సనన్ ప్రభాస్ ని చాలా బాగా చూసుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే అప్పుడు ప్రభాస్ కాలుకి గాయం కాగా, కృతి సనన్ సహాయం చాలా తీసుకున్నాడు ఆదిపురుష్ ప్రచారాలు చేసేటప్పుడు అని ఒక వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది కూడా.

prabhas2.jpg

మరి ఇప్పుడు భారతదేశ సినిమాలు గురించి, సినిమా వార్తలు గురించి ఉమైర్ సంధు అనే అతను సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు పెడుతూ ఉంటాడు. అటువంటి ఉమైర్ సంధు ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని ఒక న్యూస్ పెట్టాడు. అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. అయితే ఈ వార్తకి ప్రభాస్, కృతి సనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇటువంటి వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న, సినిమా ముందు ఇలాంటి వార్తలు రావటం సహజమే అని అందరూ కొట్టి పడేసారు. కానీ ఇప్పుడు ప్రభాస్, కృతి సనన్ విషయంలో మరి ఉమైర్ సంధు రాసిన ఈ వార్త ఎంతవరకు నిజమో మరి. ప్రభాస్, కృతి ఇద్దరూ లేక ఒకరయినా దీనిమీద స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - 2023-02-06T11:08:51+05:30 IST