Pooja Hegde: ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-02-01T17:34:25+05:30 IST

ఈమధ్యనే పూజ హెగ్డే అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం పూజ కొన్ని రోజులు షూటింగ్స్ నుండి విరామం తీసుకొని అన్నయ్య కి తోడుగా పెళ్ళిలో బాగా సందడి చేసింది.

Pooja Hegde: ఫోటోస్ వైరల్

పూజ హెగ్డే (Pooja Hegde) ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో SSMB28 కథానాయికగా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Sreenivas) దీనికి దర్శకుడు, కాగా పూజ హెగ్డే కి త్రివిక్రమ్ తో ఇది మూడో సినిమా. ఇంతకు ముందు 'అరవింద సమేత', 'అల వైకుంఠపురం లో' అనే సినిమాలు చేసింది.

pooja-saree.jpg

పూజ హెగ్డే కి ఈమధ్య హిట్స్ కొంచెం తగ్గాయి, అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan) తో నటించిన కిసి కా భాయ్ కిసి కా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) హిందీ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'కాటమయుడు' కి రీమేక్. ఇందులో తెలుగు నటులు వెంకటేష్ (Venkatesh Daggubati), జగపతి బాబు (Jagapathi Babu) కూడా వున్నారు.

pooja-saree2.jpg

ఈ సినిమా విజయం సాధిస్తే పూజ హెగ్డే కి కొంచెం ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఒక్క హిట్ కూడా ఈమధ్య పడలేదు, దానికి తోడు పారితోషికం కూడా ఎక్కువ, అందుకని ఈ సినిమా విజయం సాధించాలని ఈమధ్య పెద్దమ్మ గుడి కి కూడా వెళ్లి పూజలు చేయించింది ఈ కర్ణాటక ముద్దుగుమ్మ.

pooja-saree3.jpg

పూజ కి ఇప్పుడు చేతిలో కూడా సినిమాలు ఏమి లేవు. ఒక్క మహేష్ బాబు తో సినిమా తప్పితే. హిందీ సినిమా విజయం సాధిస్తే మళ్ళీ ఆమె హవా నడుస్తుంది. ఒకవేళ అది కూడా ఆడకపోతే, పూజని అంతగా పట్టించుకోని వారు వుండరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నటీమణులు వస్తున్నారు, మంచి పోటీ కూడా ఇస్తున్నారు.

pooja-saree4.jpg

ఈమధ్యనే పూజ హెగ్డే అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం పూజ కొన్ని రోజులు షూటింగ్స్ నుండి విరామం తీసుకొని అన్నయ్య కి తోడుగా పెళ్ళిలో బాగా సందడి చేసింది. ఆలా సందడి చేసిన సమయం లోనే, పూజా ఇదిగో ఈ ఎథినిక్ చీరలో బాగా ముస్తాబయి, తెలుగు అమ్మాయిలా పెళ్ళిలో అందరి కళ్ళు ఆకర్షించింది అని అంటున్నారు.

pooja-saree5.jpg

Updated Date - 2023-02-01T17:34:26+05:30 IST