షాకింగ్.. ఓ సాధారణ గృహిణి ఇంట్లో బయటపడ్డ రూ.30 కోట్ల నోట్ల కట్టలు.. అసలు మిస్టరీ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-01-20T15:06:26+05:30 IST

ఆ 54 ఏళ్ల మహిళ ఓ సాధారణ గృహిణి.. అందరు మహిళల్లాగానే భర్తను, పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతోంది.. ఇటీవల ఆమె ఇంటిపై కస్టమ్స్ అధికారులు దాడి చేశారు.. ఏకంగా ఆమె గదిలో నుంచి రూ.30 కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు..

షాకింగ్.. ఓ సాధారణ గృహిణి ఇంట్లో బయటపడ్డ రూ.30 కోట్ల నోట్ల కట్టలు.. అసలు మిస్టరీ ఏంటంటే..!

ఆ 54 ఏళ్ల మహిళ ఓ సాధారణ గృహిణి.. అందరు మహిళల్లాగానే భర్తను, పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతోంది.. ఇటీవల ఆమె ఇంటిపై కస్టమ్స్ అధికారులు దాడి చేశారు.. ఏకంగా ఆమె గదిలో నుంచి రూ.30 కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ఆ మహిళ అత్యంత రహస్యంగా నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునే సిండికేట్‌ను నడుపుతోందని కనిపెట్టారు.. ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.. హాంకాంగ్‌లో (Hong Kong) ఈ ఘటన బయటపడింది.

హాంకాంగ్‌లో గత 114 ఏళ్లలో ఇదే అతిపెద్ద మనీలాండరింగ్ (Money Laundering) కేసు అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఈ మహిళతో పాటు మరో ఎనిమిది మంది ఈ వ్యక్తులు నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి (Legalizing Black Money) డజన్ల కొద్దీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. ఇప్పటి వరకు దాదాపు 178 బిలియన్ యువాన్లకు పైగా నల్లధనాన్ని వీరు వైట్‌గా మార్చారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రూ.30 కోట్ల నగదుతోపాటు పలు నగదు లెక్కింపు యంత్రాలు, బ్యాంకు కార్డులు, రహస్య పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీరందరూ కలిసి 11 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. డజన్ల కొద్దీ వ్యాపార, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను తెరిచారు. వీరు నిర్వహిస్తున్న ఖాతాల ద్వారా జనవరి 2020 నుంచి డిసెంబర్ 2022 మధ్య 7,600 కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఆయా ఖాతాల ద్వారా 487 బిలియన్ యువాన్లు విదేశాలకు తరలిపోయాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు (Converting Black Money into White).

Updated Date - 2023-01-20T15:06:28+05:30 IST