OYO Rooms: కస్టమర్లుగా మారు వేషాల్లో ఓయో హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతోంది స్వయంగా చూసి..

ABN , First Publish Date - 2023-03-20T19:17:16+05:30 IST

ఓయో హోటల్ యజమానికి ఊహించని షాకిచ్చిన పోలీసులు

OYO Rooms: కస్టమర్లుగా మారు వేషాల్లో ఓయో హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతోంది స్వయంగా చూసి..

ఇంటర్నెట్ డెస్క్: అది ఆదివారం రాత్రి.. జనసంచారం సద్దుమణిగింది. ఇంతలో ఓ వ్యక్తి ఓ హోటల్‌లోకి వెళ్లాడు. ఆ టైంలో వచ్చిన వ్యక్తిని చూడగానే హోటల్ మేనేజర్ ..మరో కస్టమర్ దొరికాడనుకుంటూ సంబరపడ్డాడు. ఆ తరువాత అతడికి అన్నీ చెప్పేశాడు. గదిలోకి కూడా తీసుకెళ్లాడు. ఆ తరువాతే అతడికి ఊహించిన షాక్ తగిలింది. హోటల్‌కు వచ్చిన వ్యక్తి మఫ్టీలో ఉన్న పోలీసులని తెలిసి దిమ్మెరపోయాడు. హరియాణాలోని(Haryana) నార్‌నాల్‌ ప్రాంతంలోగల ఓ ఓయో హోటల్‌లో(Oyo Hotel) జరిగిందీ ఉదంతం.

ఆ హోటల్‌లో వ్యబిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా.. హోటల్‌లో పోలీసులకు ఓ మహిళ కూడా కనిపించింది. ఈ క్రమంలో ఆమెను విచారించగా తాను కోల్‌కతా నుంచి వచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. దీంతో.. పోలీసులు హోటల్ ఆపరేటర్ రవింద్ర, మేనేజర్ అనుజ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. హోటల్‌లో జరుగుతున్న వ్యవహారం గురించి చాలా రోజుల క్రితమే పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో డీఎస్‌పీ మహిళా పోలీసులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితులను ఆటకట్టించారు.

Updated Date - 2023-03-20T19:17:16+05:30 IST