Share News

Viral: రైల్లో తన ఎదురుగా మహిళ డ్యాన్స్.. కంట్రోల్ తప్పిన ఈ పోలీసు చేసిన పని చూస్తే..

ABN , First Publish Date - 2023-12-10T20:18:22+05:30 IST

ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న యువతితో కలిసి డ్యాన్స్ చేసిన పోలీసు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral: రైల్లో తన ఎదురుగా మహిళ డ్యాన్స్.. కంట్రోల్ తప్పిన ఈ పోలీసు చేసిన పని చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య యువత షార్ట్స్ చేయడమే పనిగా పెట్టుకుంది. బహిరంగ ప్రదేశాల్లో యువతీయువకులు వీడియోలు చిత్రీకరిస్తూ నానా హంగామా సృష్టి్స్తున్నారు. మెట్రోల్లో ఈ హడావుడి పీక్స్‌లో ఉంటే రైల్వే స్టేషన్లు, రైళ్లల్లోనూ ఈ మధ్య కొందరు డ్యాన్స్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. కొందరికి పోలీసులంటే కూడా భయం లేకుండా పోతోంది. వారి ఎదురుగా డ్యాన్స్ వీడియోలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ మహిళ పోలీస్ వాహనంపై కూర్చుని డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా(Viral Video) మారిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను షాక్ గురి చేస్తోంది.


వీడియోలోని యువతి ఓ ట్రైన్‌లో డ్యాన్స్ వీడియో చేస్తూ రెచ్చిపోయింది. బోగీలో డోర్ వద్ద నిలబడి ఆమె డ్యాన్స్ చేస్తుండగా మరో వ్యక్తి రికార్డు చేశాడు. అక్కడే పోలీసు నిలబడ్డా కూడా యువతి లెక్క చేయలేదు. తొలుత ఒకసారి పోలీసు వైపు తిరిగి పెద్దపెట్టున నవ్విన ఆమె ఆ తరువాత యథా ప్రకారం డ్యాన్స్ చేయడం కొనసాగించింది. ఆ పోలీసు మొదట్లో తన బాధ్యత ప్రకారం ఆమెను వారించాడు. ప్రయాణికులకు ఇబ్బందని ఆమెను హెచ్చరించాడు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ తాను పోలీసు యూనీఫాంలో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఆమెతో చిందేయడం ప్రారంభించాడు (Police dances with woman in insta reels video).


ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు కట్టుతప్పకుండా చూడాల్సిన పోలీసులే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టాలను అమలు పరిచేది ఎవరని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం పోలీసు ఉద్యోగం ఆ తరువాత పోయి ఉండొచ్చని కూడా సందేహం వ్యక్తం చేశారు. యువతికి వ్యూస్ వస్తే పోలీసుకు జాబ్ పోయి ఉండొచ్చంటూ కొందరు సెటైర్లు పేల్చారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-12-10T20:18:26+05:30 IST