Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

ABN , First Publish Date - 2023-02-22T10:53:48+05:30 IST

జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది.

Pawan Kalyan: మేనల్లుడుతో మొదలయిన సినిమా

జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ (#PawanKalyan) ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలెట్టారు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది. సముద్రఖని (#Samuthirakani) దీనికి దర్శకుడు. సముద్రఖని ఇంతకు ముందు చాలా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు, ఆ తరువాత నటుడిగా మారి చాలా సినిమాలతో నటుడిగా చాలా బిజీ అయ్యాడు. ఇప్పుడు చాలా కాలం తరువాత మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు సముద్రఖని. ఇది ఒక తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitham) కి రీమేక్.

pk-sdt2.jpg

పవన్ కళ్యాణ్ ఈమధ్య చాలా సినిమాలు ఒప్పుకున్నాడు కానీ, ఏ సినిమా ముందు షూటింగ్ స్టార్ట్ చేస్తాడో అని అందరికి ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఆ సందేహాలన్నీ పటా పంచలు అయిపోయాయి. సముద్రఖని దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు.

pk-sdt3.jpg

ఇందులో పవన్ కళ్యాణ్ (#PawanKalyan) కేవలం 20 నుండి 25 రోజులపాటు షూటింగ్ చేస్తే చాలని అంటున్నారని, అందుకని ఇది ముందు చేస్తున్నట్టుగా భోగట్టా. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్నారు, టి. జి. విశ్వప్రసాద్ (TG Viswaprasad), వివేక్ కూచిబొట్ల నిర్మాతలు.

pk-sdt4.jpg

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ (#DirectorSujeeth) తో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు, అది అధికారికంగా కూడా లాంచ్ అయింది. ఇదే కాకుండా దర్శకుడు క్రిష్ (#DirectorKrish) తో 'హరిహర వీరమల్లు' (#HariHaraVeeramallu) సినిమా కూడా షూటింగ్ చాలా భాగం అయిపోయి వుంది. దానికి ఇంకొన్ని రోజులు పవన్ కళ్యాణ్ కేటాయిస్తే చాలు, అది కూడా అయిపోతుంది అని అంటున్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ (#HarishShankar) తో కూడా ఒక సినిమా వుంది.

pk-sdt5.jpg

సముద్రఖని సినిమా ఈరోజు అధికారికంగా షూటింగ్ మొదలయినట్టుగా కొన్ని ఫోటోస్ పంపారు. అందులో దర్శకుడు సముద్రఖని, సాయి ధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ #(TrivikramSrinivas), ఇంకా నిర్మాతలు, సంగీత దర్శకుడు థమన్ (#SSThaman) వీళ్ళందరూ వచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

Updated Date - 2023-02-22T10:53:49+05:30 IST