Oscars: ఆస్కార్ గెలుచుకున్నాకా.. ఆ ఏనుగుని చూడ్డానికి టూరిస్టులు క్యూ కడుతున్నారట..!

ABN , First Publish Date - 2023-03-14T11:09:20+05:30 IST

ఈ ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

Oscars: ఆస్కార్ గెలుచుకున్నాకా.. ఆ ఏనుగుని చూడ్డానికి టూరిస్టులు క్యూ కడుతున్నారట..!
Elephant

'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఈ చిత్రం ద్వారా ఫేమస్ అయిన ఈ ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న కుటుంబం చుట్టూ సినిమా కథాంశం తిరుగుతుంది. నీలగిరి చుట్టూ, మాయార్ నదికి ఆవల, బొమ్మన్, బెల్లీ వారి బిడ్డ రఘు (ఏనుగు) తెప్పకాడు ఏనుగుల శిబిరం నడిబొడ్డున, ముదుమలై టైగర్ రిజర్వ్ వద్ద నివసిస్తున్నారు. తన చిన్న డాక్యుమెంటరీలో, కార్తికీ గొన్సాల్వెస్ ఈ ముగ్గురు కుటుంబాన్ని ఫాలో అవుతూ, మారుతున్న అడవిలో కాలానుగుణంగా మార్పును చూపిస్తూ సాగుతుంది మొత్తం 45 నిముషాల ఈ డాక్యుమెంటరీ.

చెట్లు రంగు మారడం, నది తిరిగి పుంజుకోవడం, వేసవిలో అడవి కాలిపోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కట్టునాయకన్ తెగకు చెందిన బొమ్మన్, బెల్లీ జీవితం ఈ అడవి చుట్టూ తిరుగుతుంది. ఇక్కడే వారి పూర్వీకులు అడవిని రక్షించడానికి పనిచేశారు. ఆ సమయంలో బొమ్మన్, బెల్లీ అనే ఇద్దరికి రఘు అనే ఏనుగు గాయపడి దాని మంద నుండి వేరు చేయబడి కనిపిస్తుంది. దానిని ఈ ఇద్దరూ సాకుతారు. అటవీ అధికారులు ఏనుగు పిల్లను దాని మందతో తిరిగి కలపడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు.

అది అంతగా ఫలించదు. బెల్లీ పెద్దవయసు వచ్చినా తను పుట్టి పెరిగిన అడవిని నమ్ముకునే జీవిస్తూ ఉంటుంది. తన భర్త పులి చిక్కి చనిపోయినా కూడా ఆమెకు అడవి అంటే ఉన్న ప్రేమ పోదు. తను కూడా అక్కడే రాలిపోవాలనే ఆశతో ఉంటుంది. ఇక బొమ్మన్ అక్కడే ఉండి తప్పిపోయిన ఏనుగుపిల్లలను చూసుకుంటూ ఉంటాడు. ఆ పని ప్రభుత్వమే అతనికి అప్పగిస్తుంది. ఇలా ఈ ఇద్దరి జీవితాల్లోకీ అనుకోకుండా వచ్చి చేరుతుంది రఘు అనే మూడు నెలల ఏనుగు పిల్ల.

"ఇది చాలా గొప్ప క్షణం. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఏనుగు నాకు ఇష్టమైన జంతువు. ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని ఒక పర్యాటకుడు చెప్పాడు.

ఇది కూడా చదవండి: మన దేశానికి ‘ఆస్కార్’ను అందించిన TheElephantWhisperers స్టోరీ ఏంటంటే..!

95వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో తమిళ డాక్యుమెంటరీ దర్శకుడు కార్తికీ గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా బంగారు విగ్రహాన్ని అందుకున్నారు.

గునీత్ మోంగా మాట్లాడుతూ "మనకు, మన సహజ ప్రపంచానికి మధ్య ఉన్న పవిత్ర బంధం గురించి మాట్లాడటానికి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇతర జీవుల పట్ల అస్తిత్వాన్ని, మేము మా చిత్రంలో చూపించగలిగాం అనుకుంటాను. మా సినిమా ఆదివాసీలు, జంతువులను హైలైట్ చేసిందని నమ్మిన అకాడమీకి ధన్యవాదాలు. ఈ సినిమా శక్తిని నమ్మినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు కూడా కృతజ్ఞతలు. నా నిర్మాతకు, నా టీమ్ మొత్తానికి గునీత్‌కి, మా అమ్మ నాన్న, చెల్లెలికి, నా విశ్వాసానికి కేంద్రమైన నా మాతృభూమి భారతదేశానికి ఈ విజయం అంకితం" అని తన ప్రశంగాన్ని ముగించారు. గునీత్ మోంగా ఆస్కార్ గెలవడం ఇదే మొదటిసారి కాదు. 2019లో, మోంగా డాక్యుమెంటరీ 'పీరియడ్. 'డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్' విభాగంలో ఎండ్ ఆఫ్ సెంటెన్స్' ఆస్కార్‌ను కైవసం చేసుకుంది.

Updated Date - 2023-03-14T11:09:20+05:30 IST